నేనూ ఆ ఇబ్బందిని ఎదుర్కొన్నా...
నాని సరసన ‘మజ్ను’తో తెలుగు తెరకు పరిచయమైంది అను ఇమ్మాన్యుయేల్.. ప్రస్తుతం కార్తీతో ‘జపాన్’లో నటిస్తోంది. ఈ మూవీ దీపావళికి విడుదల కానుంది.
ఈ చిత్రం తెలుగు ట్రైలర్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ట్రైలర్‌లో అను తన క్యూట్ లుక్స్‌తో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది.
‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’, ‘ఆక్సిజన్’, ‘అజ్ఞాతవాసి’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, ‘ఊర్వశివో రాక్షసివో’, ‘శైలజ రెడ్డి అల్లుడు’ తదితర చిత్రాలతో ఆకట్టుకుంది.
‘శైలజ రెడ్డి అల్లుడు’లో నాగచైతన్య సరసన అనుగా నటించింది. ఆ పాత్రలో ఎంతగా ఒదిగిపోయిందంటే.. ఇంట్లో తల్లీ కూతుళ్లు ఎలా గిల్లికజ్జాలు పెట్టుకుంటారో అచ్చం అలాగే నటించింది.
ఈ సినిమా సమయంలో మీకు ఎలాంటి డ్రీమ్ రోల్ ఉందని అనుని అడగగా.. ‘మహిళలకు గుర్తింపునిచ్చే పాత్రలు అయితే చాలు. అంతే కానీ నాకు ఎలాంటి డ్రీమ్ రోల్స్ లేవు’ అని సమాధానమిచ్చింది.
క్యాస్టింగ్ కౌచ్ విషయంలో అను ఈ మధ్య వార్తలో నిలిచిన సంగతి తెలిసిందే.. ఈ సమస్యతో తాను కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఇలాంటి సమయంలోనే కుటుంబం తోడుగా ఉంటే ఎలాంటి సమస్యకైనా ఎదురీదొచ్చు అని అంటుంది.
మహిళలకు జరుగుతున్న అన్యాయాలకు ఎదురుతిరిగేందుకు తన వంతు కృషి చేస్తోంది. పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బంది పడుతున్న మహిళలకు అండగా నిలబడుతోంది.
ఓ హీరోతో ఆమె డేటింగ్‌లో ఉన్నట్లు సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి. ‘నటీనటులన్నాక ఇలాంటి వార్తలు రావడం సాధారణం. అసత్య ప్రచారాలను పట్టించుకోను.. కానీ మా అమ్మ వాటిని చూసి బాధపడిందని’ పోస్టు చేసింది.
తెలుగులో సినిమా చేసే అవకాశం వస్తుందని ఊహించనే లేదు. యాక్టింగ్ కోసం చదువు మధ్యలో ఆపేసింది. ‘చదువును ఎప్పటికైనా పూర్తి చేస్తా… కానీ యాక్టింగ్‌లో మళ్లీ అవకాశం రాదు కదా..!’ అంది.
అనుకి మట్టితో కుండలు, వివిధ కళాకృతులు చేయడమంటే ఇష్టం. ఖాళీ సమయం దొరికితే ఇలాంటివి చేస్తూ వాటికి పెయింటింగ్ చేస్తుంది.