‘జవాన్‌’ గురించి మీకివి తెలుసా..?

షారుఖ్‌ ఖాన్‌, నయనతార జంటగా తెరకెక్కిన చిత్రం ‘జవాన్‌’. ఇందులో షారుఖ్‌ది డ్యూయెల్‌ రోల్‌. ఈ మూవీ సెప్టెంబరు 7న విడుదల కానుంది. దర్శకుడు అట్లీ.

(photos:instagram)

భారీ బడ్జెట్‌తో యాక్షన్‌ జానర్‌లో వస్తోన్న చిత్రమిది. ఇందులో నయనతార పాత్ర కాస్త భిన్నంగానే ఉంటుందని చెప్పొచ్చు. 

దక్షిణాదిలో అగ్ర నాయిక నయనతార మొదటిసారిగా ‘జవాన్‌’తో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. ‘రామయ్య వస్తావయ్యా..’, ‘ఛలేయా...’ తదితర పాటల్లో తన డ్యాన్స్‌తో అభిమానుల్ని ఆకట్టుకుంది.

ఇది నయన తార 75వ చిత్రం. మాస్టర్‌ కంపోజర్‌ అనిరుథ్‌ సంగీత దర్శకుడు. 

హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో విశ్వక్‌సేన్‌ ప్రియమణి, దీపికా పదుకొణె వంటి ప్రముఖులు నటించారు.

బాక్సాఫీస్‌ వద్ద రికార్డు సృష్టించిన ‘దంగల్‌’లో బబిత కుమారిగా నటించిన సాన్యా మల్హోత్రా ‘జవాన్‌’లో ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తోంది. 

మెట్రో హైజాక్‌ సీన్‌లో షారుఖ్‌ గుండుతో కనిపిస్తారు. ఆ సన్నివేశంలో హీరో ఆలియా భట్‌ కావాలని డిమాండ్‌ చేస్తారు. ఆలియా సోషల్‌మీడియా వేదికగా అందరికీ షారుఖ్‌ కావాలి.. మరి ఆయన నన్నెందుకు అడిగారని సరదాగా స్పందించింది.

‘జవాన్‌’ కోసం దాదాపుగా మూడేళ్లు కష్టపడ్డాం. ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నాం. ఇందులో లవ్‌ ఎమోషన్‌ ఎక్కువగా ఉంటుంది. ప్రేక్షకులకి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందంటూ షారుఖ్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

మహిళా సాధికారత, హక్కుల కోసం పోరాడే నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమా టీజర్‌ సోషల్‌మీడియాలో వైరలయ్యింది. రీలీజ్‌ అయిన నాలుగు రోజుల్లోనే 42 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి.

This browser does not support the video element.

ఈ సినిమా షోకు ప్రీ బుకింగ్‌లో ఇప్పటికే 75 లక్షలకు పైగా టికెట్లు బుక్‌ చేసుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది.  

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home