అందమైన చంద్రముఖి.. కంగనా
‘చంద్రముఖి’కి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘చంద్రముఖి 2’తో కంగనా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
రాఘవ లారెన్స్, కంగనా ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళ నటి మహిమా నంబియార్ మరో కథానాయిక.
This browser does not support the video element.
ఇంత మంచి చిత్రంలో నటించినందుకు సంతోషంగా, గర్వంగా అనిపిస్తుంది. పోస్టర్ చూసుకొని.. నన్ను నేను మరిచిపోయేంతగా తన్మయత్వంలో మునిగిపోయాను. - కంగనా
‘ఎమర్జెన్సీ’లో కంగనా ఇందిరా గాంధీ పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాకు మెగాఫోన్ పట్టింది కూడా ఆమెనే.
‘గ్యాంగ్‌స్టర్’తో 2006లో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి... 2009లో ప్రభాస్ ‘ఏక్ నిరంజన్’లో నటించింది.
‘పోకిరి’తో టాలీవుడ్‌లో అడుగుపెట్టాలి.. అదే సమయంలో ‘గ్యాంగ్‌స్టర్’ అవకాశం రావడంతో ఆ సినిమా చేయలేకపోయింది.
కంగనాకు ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారం లభించింది. మూడు జాతీయ పురస్కారాలు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులనూ అందుకుంది.
మూడు పదుల వయసు దాటినా ప్రేక్షకుల్లో కంగనా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఎప్పుడూ చిత్రపరిశ్రమలో నటీనటులు పడే ఇబ్బందుల గురించే కాకుండా సమాజంలో జరిగే సంఘటనలపై కూడా గొంతెత్తుతూ ఉంటుంది.
‘తలైవి’లో కంగనా జయలలిత పాత్రను పోషించింది. ఆ క్యారెక్టర్ కోసం ఏకంగా 20 కిలోల బరువు పెరిగింది.
‘ఆరు నెలల్లో 20 కేజీల బరువు పెరగటం, మళ్లీ తగ్గటం.. కష్టంతో కూడుకున్న పనే. ఒక్కసారి తెర మీద తమను తాము చూసుకున్నాక ఎంత కష్టాన్నైనా మర్చిపోతారు’ అని అంటోంది.
This browser does not support the video element.
కంగనా కఠినమైన వ్యాయామాలు చేస్తుంది. ఫిట్‌గా ఉండేందుకు ప్రొటీన్ షేక్‌లు, చపాతీలు తన భోజనంలో తప్పనిసరిగా ఉండాలి.
కంగనా వ్యాపారాల్లోనూ రాణిస్తోంది. తన ఆదాయాన్ని వివిధ రంగాల్లో పెట్టుబడులుగా పెడుతుంటుంది.