‘టైగర్‌ 3’లో మల్లీశ్వరి

‘మై నేమ్‌ ఈజ్‌ షీలా..’ అంటూ యువతను ఉర్రూతలూగించింది కత్రినా కైఫ్‌. ప్రస్తుతం ‘టైగర్‌ 3’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ దీపావళికి విడుదల కానుంది.

(photos: instagram)

గతంలో వచ్చిన ‘ఏక్‌ థా టైగర్‌’, ‘టైగర్‌ జిందా హై’కి సీక్వెల్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. సల్మాన్‌ఖాన్ హీరో. 

విజయ్‌ సేతుపతి సరసన ‘మెరీ క్రిస్మస్‌’లోనూ కత్రినా నటిస్తోంది. త్వరలో ఇది విడుదల కానుంది. ఇదో క్రైమ్‌ జానర్‌.

This browser does not support the video element.

కత్రినా ఇటీవల పోస్టు చేసిన ఓ వీడియో చర్చలకు దారి తీసింది. దానిలో మొహానికి ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నట్లు ఉందని.. అభిమానులు సోషల్‌ మీడియాలో అభిప్రాయాలను పంచుకున్నారు.

సహ నటుడు విక్కీ కౌశల్‌ని రెండేళ్ల క్రితం వివాహం చేసుకుంది. ‘మరి పిల్లలు?’ అంటూ వస్తోన్న ప్రశ్నలకు.. ‘మా కుటుంబాల నుంచి పిల్లల గురించి ఎటువంటి ఒత్తిడి లేదు. దయచేసి మా వ్యక్తిగత జీవితాల్లోకి రావద్దు.’ అంటూ స్పందిస్తుందీ జంట.

కత్రినా పుట్టింది హాంగ్‌కాంగ్‌లో. పెరిగింది బ్రిటన్‌లో.. నటించడం కోసమే భారత్‌కు వచ్చింది.

‘నా భార్యకి పరాటాలు, వెన్న ఇష్టం. నాకేమో పాన్‌కేక్‌. మేమిద్దరం కష్టసుఖాలతో పాటు ఒకరి రెసిపీలను ఇంకొకరం షేర్‌ చేసుకుంటాం.’ అని విక్కీ వారి వైవాహిక జీవితం గురించి పోస్టు చేశారు.

కత్రినా పెళ్లయ్యాక సినిమాలకు దూరంగానే ఉంటూ.. వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తోంది. ఇకపై సినిమాల్లో అతిగా అందాల ఆరబోత చేయనని చెబుతోంది.

This browser does not support the video element.

బిజినెస్‌లోనూ తనది సొంత ముద్ర. ‘సౌందర్య ఉత్పత్తులంటే చిన్నప్పట్నుంచే నాకిష్టం. బ్యూటీ ప్రొడక్ట్స్‌తో కంపెనీని ప్రారంభించాలని ఉండేది. అందుకే ‘కే బ్యూటీ’ని మొదలుపెట్టాను’ అని చెబుతుంది. 

ఆయనే నా డ్యాన్స్‌ టీచర్‌

మేనమామే అయినా 17 సార్లు ఆడిషన్‌ ఇచ్చింది!

యూట్యూబ్‌ నుంచి కేన్స్‌ దాకా..

Eenadu.net Home