‘గేమ్‌ ఛేంజర్‌’ కియారా..

‘భరత్ అనే నేను’లో ‘వసుమతి’గా తెలుగు ప్రేక్షకులను అలరించిన కియారా అడ్వాణి ప్రస్తుతం రామ్‌ చరణ్‌తో ‘గేమ్‌ ఛేంజర్‌’లో నటిస్తోంది. ఇదో పాన్‌ ఇండియా మూవీ.

ఇదో పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌. శంకర్‌ దర్శకుడు. తమన్‌ సంగీతం. 

ఈ ఏడాది బాలీవుడ్‌లో కార్తీక్‌ ఆర్యన్‌ హీరోగా నటించిన ‘సత్య ప్రేమ్‌ కీ కథా’తో కియారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. 

బాలీవుడ్‌లో ‘షేర్షా’తో సిద్ధార్థ్‌ మల్హోత్రా, కియారా తెరపై హిట్‌ పెయిర్‌గా నిలిచారు. వీరిద్దరూ ప్రేమించుకొని ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. 

అంబానీ ఇంట్లో వినాయక చవితి పూజకి కియారా, సిద్ధార్థ్‌ మల్హోత్రా హాజరయ్యారు. పసుపు చీరతో కియారా తళుక్కున మెరిసింది. ఫ్యాషన్‌ ఐకాన్‌గా రుజువు చేసుకుంది. 

ఈ బ్యూటీ ఇటీవల షూటింగ్‌ కోసం వాఘా సరిహద్దుకు వెళ్లింది. అక్కడ జవాన్లను అభినందించింది. కాసేపు వారితో ముచ్చటించి.. ఫొటోలు తీసుకుంది. 

ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌లు నటిస్తున్న ‘వార్‌ 2’లో కియారా నాయిక అని వినిపిస్తోంది. అధికారికంగా అయితే ఇంకా ప్రకటన రాలేదు.

ఈ ఫ్యాషన్‌ ఐకాన్‌ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫొటోలను పంచుకుంటుంది. ఇన్‌స్టాలో తన ఫాలోవర్స్‌ 3.14 కోట్ల మంది.

కియారా విహారయాత్రకి న్యూయార్క్‌ సిటీకే వెళ్తుంది. బైక్‌ రైడింగ్‌ అంటే ఈ భామకి ఇష్టం.

This browser does not support the video element.

నెలల వయసులోనే కియారా తన అమ్మతో కలసి విప్రో బేబి యాడ్‌లో నటించింది. ‘ఈ యాడ్‌ లేకపోయుంటే ఈ రోజు నేను లేను. ధన్యవాదాలు అమ్మ.’ అంటూ గుర్తు చేసుకుంది.

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home