వయ్యారాల ఉప్పెన..!

‘ఉప్పెన’ అనగానే గుర్తొచ్చే పేరు.. కృతి శెట్టి. అందం, అమాయకత్వం, అభినయంతో ఈ సినిమాలో ఆమె ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. సెప్టెంబరు 21న కృతి పుట్టినరోజు.

‘సూపర్‌ 30’తో 2019లోనే కృతి బాలీవుడ్‌లో అడుగుపెట్టినా.. ‘ఉప్పెన’తోనే ఫేమస్‌ అయ్యింది. ఆమె చేసిన ‘బేబమ్మ’ పాత్రకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

‘శ్యామ్‌ సింగరాయ్‌, ‘మాచర్ల నియోజకవర్గం’, ‘ద వారియర్‌’, ‘కస్టడీ’ తదితర చిత్రాల్లోనూ ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.

This browser does not support the video element.

కర్ణాటకలో పుట్టిన కృతి.. పదహారేళ్ల వయసులో యాక్టింగ్‌లోకి అడుగుపెట్టింది. ‘చిన్నప్పట్నుంచీ డాక్టర్‌ అవ్వాలనేది కల. యాక్టర్‌ని అవుతానని అసలు ఊహించనేలేదు’. 

 పుట్టిన రోజు సందర్భంగా కృతి ఇన్‌స్టాలో ఓ ఎమోషనల్‌ పోస్టు పెట్టింది. ‘భూమి మీద నేను ఇంకో సంవత్సరాన్ని పూర్తి చేసుకున్నాను. నాకు అతి పెద్ద మోటివేషన్‌, స్ఫూర్తి నా కుటుంబమే.. కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు..’

కృతిని ఓ అగ్రహీరో కుమారుడు ఇబ్బంది పెడుతున్నట్టు వార్తలొచ్చాయి. అందుకు ఆమె ‘‘దయచేసి ఇలాంటి కథనాలు సృష్టించి.. అసత్య ప్రచారాలు చేయడం మానండి’’. అంటూ స్పందించింది.

‘అజాయంతే రందం మోషణం’ , ‘జీని’ చిత్రంలోనూ నటిస్తోంది. ఇవే కాకుండా.. శర్వానంద్‌ 35వ సినిమాలో కృతి హీరోయిన్‌. పుట్టిన రోజు కానుకగా ఓ వీడియో విడుదల చేశారు.

‘పుష్ప’లోని ‘ఊ అంటావా.. మావా..’ పాటలో అవకాశం వస్తే ఓప్పుకొనేవారా..? అని ప్రశ్నిస్తే.. అందుకు కృతి.. ‘నేను చేయను.. నాకు అసౌకర్యంగా అనిపించిన పాత్రలకు నో చెప్తాను. ప్రస్తుతానికి ఇలాంటి పాటల గురించి ఆలోచించట్లేదు’ అని బదులిచ్చింది.

ఈ కన్నడ భామకి చీరలు, పరికిణీ వోణీలు అంటే ఇష్టం. పండగ వచ్చిందటే అవే ధరించి సందడి చేస్తుంది.

This browser does not support the video element.

ఫొటోషూట్స్‌లో ఎక్కువగా పాల్గొనే కృతి వాటిని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పంచుకుంటుంది. తన ఇన్‌స్టా ఫాలోవర్స్‌ 64 లక్షల మంది. 

ఏ ట్రైలర్‌ని ఎంత మంది చూశారో..?

తెలుగు హీరో.. మలయాళీ విలన్‌!

‘యానిమల్‌’ త్రిప్తి గురించి తెలుసా?

Eenadu.net Home