కృతి సనన్.. గ్లామర్‌ అదిరెన్‌..!

కళ్లతోనే కబుర్లు చెప్పే కృతి సనన్.. ప్రేక్షకులను అలరించేందుకు ‘తోడేలు’తో వచ్చేసింది. 

image:instagram/kritisanon

‘1 నేనొక్కడినే’తో తెలుగు తెరపై మెరిసిన కృతి.. తర్వాత నాగచైతన్య సరసన.. ‘దోచెయ్‌’లో చేసింది. ‘తోడేలు’తో చాలా ఏళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకులను పలకరించింది.  

image:instagram/kritisanon

ఈమె 1990 జులై 27న దిల్లీలో జన్మించింది. నోయిడాలోని జేపీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌లో పట్టా అందుకుంది.  

image:instagram/kritisanon

This browser does not support the video element.

నటన మీద ఆసక్తితో మోడలింగ్‌లో కెరీర్‌ను ప్రారంభించిన ఈ భామ. ‘హీరోపంతి’లో కథానాయికగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పటి వరకు 18 సినిమాల్లో నటించింది. 

image:instagram/kritisanon

This browser does not support the video element.

‘మిమి’తో తన కెరీర్‌ మలుపు తిరిగిందని చెప్పొచ్చు. సరోగసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో తన నటనతో మంచి గుర్తింపు పొందింది. ఈ సినిమా కోసం 15 కిలోల బరువు పెరిగిందీ బ్యూటీ. 

image:instagram/kritisanon

‘హీరో పంతి’, ‘మిమి’లో తన నటనకి గానూ ‘ఫిలింఫేర్‌’ అవార్డులను గెలుచుకుంది. 

image:instagram/kritisanon

This browser does not support the video element.

కృతి పలు వాణిజ్య ప్రకటనల్లోనూ నటించింది. వివిధ సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తోంది. 

image:instagram/kritisanon

తాను నటించిన సినిమాల్లో ‘దోచెయ్‌’ ‘లూకా చుప్పీ’, ‘రబ్తా’, ‘అర్జున్‌ పాటియాలా’, ‘పానీపట్‌’, ‘హౌస్‌ఫుల్‌ 4’, హీరో పంటి 2’ లు ఎంతో ప్రత్యేకం. 

image:instagram/kritisanon

This browser does not support the video element.

తరచూ ఫొటో షూట్లో పాల్గొని సోషల్‌ మీడియాలో తన గ్లామర్‌ ఫొటోలను పోస్టు చేస్తూ ఉంటుంది. ఈ సుందరికి ఇన్‌స్టాలో 5కోట్ల మందికి పైగా ఫాలోవర్లున్నారు.

image:instagram/kritisanon

‘గణపత్‌’, ‘శెహ్జెదా’, ‘ఆదిపురుష్‌’ సినిమాల్లోనూ నటించింది. ఇప్పటి వరకూ విభిన్న పాత్రల్లో గ్లామరస్‌గా కనిపించిన కృతి.. ఇకముందు ఎలాంటి పాత్రలతో ప్రేక్షకులను మెప్పించనుందో చూడాల్సిందే! 

image:instagram/kritisanon

మలయాళంలో టాప్‌ 10 సినిమాలు ఇవే!

ఈ వారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు

మీర్జాపూర్‌ గర్ల్‌.. హర్షితా గౌర్‌

Eenadu.net Home