‘ఖుషి’కి ఆ టైటిల్‌ పెడదామనుకున్నారు.. ఆసక్తికర విశేషాలు..

అగ్ర కథానాయిక సమంత, యువతలో క్రేజ్‌ ఉన్న హీరో విజయ్‌ దేవరకొండ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘ఖుషి’. ఈ సినిమా సెప్టెంబరు 1న విడుదలవుతోంది.

(photos: instagram)

 రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘ఖుషి’కి శివ నిర్వాణ దర్శకుడు. ఇందులో విజయ్‌ విప్లవ్‌, సమంత ఆరాధ్య పాత్రల్లో నటిస్తున్నారు.

This browser does not support the video element.

ఈ మూవీ మ్యూజికల్‌ ఈవెంట్‌లో విజయ్‌, సమంత స్టేజీపై చేసిన డ్యాన్స్‌ యువత మతి పోగొట్టింది. చాలా రొమాంటిక్‌గా డ్యాన్స్‌ చేసిన వాళ్లిద్దరి వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయింది. 

ఈ చిత్రం షూటింగ్‌ ముగిసే సమయంలో కారవాన్‌లో ఉన్న ఫొటోని సమంత పోస్టు చేసి..‘ఆరు నెలలు కష్టంగా గడిచాయి. ఇక దీనికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది’ అంటూ రాసుకొచ్చింది. 

‘ఖుషి’మూవీ కేవలం తెలుగులోనే కాదు, తమిళ్‌, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. 

పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత ఎదురయ్యే సమస్యలతో గతంలో పలు సినిమాలు వచ్చినా, శివ నిర్వాణ ఈ కథను వినోదాత్మకంగా తీర్చిదిద్దారు. 

‘ఖుషి’ కథ సమంత వ్యక్తిగత జీవితానికి దగ్గరగా ఉంటుందని వార్తలు వచ్చాయి. అందులో వాస్తవం లేదని, ‘ఖుషి’లోని పాత్రకు సామ్‌ న్యాయం చేయగలదనే నమ్మకంతో ఎంపిక చేసినట్లు దర్శకుడు అన్నారు.

 ప్రస్తుత సమాజంలో నెలకొన్న ఓ సమస్యని విజయ్, సమంతలాంటి స్టార్స్‌తో ప్రస్తావిస్తే బాగుంటుందనుకుని శివ ఈ కథను తీర్చిదిద్దారట. ఆ పాయింట్‌ వారికి కూడా నచ్చిందట. అలా ‘ఖుషి’ పట్టాలెక్కింది

 గతంలో శివ తీసిన ‘నిన్ను కోరి’,‘మజిలీ’ చిత్రాల్లో ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ చూపించగా, ఈ కథ అందుకు భిన్నంగా పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కించారు. 

This browser does not support the video element.

ఈ మూవీకి ‘సరదా’ అనే టైటిల్‌ సహా మరికొన్ని పేర్లు అనుకున్నారు. విజయ్‌ సమంత, ఇమేజ్‌తో పాటు, అన్ని భాషల్లో ఒకే పేరు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో చివరకు ‘ఖుషి’ని ఖరారు చేశారు.

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home