లవ్లీ కపుల్‌ వెడ్డింగ్ డే #విరుష్క

విరాట్‌ కోహ్లీ.. అనుష్క శర్మల వివాహం జరిగి నేటికి ఆరేళ్లు అయ్యింది. డిసెంబరు 11న పెళ్లి రోజు వేడుకని చేసుకుంటూ ఈ జంట పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది.

ఓ యాడ్‌లో కలిసి నటించిన వీరిద్దరూ ముందు స్నేహితులు, ఆ తర్వాత ప్రేమికులు అయ్యారు. 2017లో వివాహం చేసుకున్నారు. అనుష్క(మే) విరాట్‌ (నవంబర్‌) కంటే వయసులో ఐదు నెలలు పెద్దది.

This browser does not support the video element.

విరాట్‌ ఆట చూడటానికి వెళ్లిన ప్రతిసారీ ఎగిరి గంతులు వేసే, గాల్లో ముద్దులు పెట్టి విసిరే వీడియోలు వైరల్‌ అయ్యేవి. శతకాలు, అర్ధ శతకాలు, గెలుపోటములు ప్రతి విషయంలోనూ అతని వెంటే తను.

గెలిచినప్పుడు అభినందనలు చెప్పే అనుష్క ఓడినప్పుడూ వెన్నంటే ఉండి ఓదార్పునిస్తుంది. 2023 వరల్డ్‌ కప్‌ ఓటమి అనంతరం అనుష్క విరాట్‌ని ఓదార్చిన ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. 

This browser does not support the video element.

అప్పుడప్పుడూ సరదాగా రీల్స్‌ చేస్తూ వాటిని ఇన్‌స్టాలో పంచుకుంటుంది విరుష్క జంట. వీరిద్దరూ కలిసి ప్రముఖ దుస్తుల బ్రాండ్లకు అంబాసిడర్‌లుగానూ వ్యవహరిస్తున్నారు.

This browser does not support the video element.

విరాట్‌ సాకర్‌కి వీరాభిమాని. అందుకని వీరిద్దరూ కలిసి మ్యాచ్‌ జరిగే సమయాల్లో సాకర్‌ స్టేడియంలో సందడి చేస్తూ ఉంటారు. 

అనుష్కకి సంబంధించిన ప్రతి విషయంలోనూ విరాట్‌ జాగ్రత్త తీసుకుంటాడు. కలిసి బయటకు వెళ్లినప్పుడు దుస్తుల నుంచి ఫోన్‌ వరకూ ప్రతి విషయంలోనూ బాధ్యతగా ఉంటాడు.

బంధువులు, ప్రముఖుల పెళ్లిళ్లు, ఈవెంట్లకు అనుష్క, విరాట్‌ హాజరవుతారు. ఇంట్లో పండుగలనూ ఘనంగా నిర్వహిస్తారు.

ఆట పరంగా ఎంత ఒత్తిడిగా ఉన్నా వివాహ బంధాన్ని విజయవంతంగా సాగిస్తున్నారు. ఒత్తిడిని ఎదుర్కొనేందుకు విరాట్‌.. అనుష్క, కూతురు వామికతో పాటుగా వెకేషన్‌లు, హాలిడే ట్రిప్పులకి వెళ్లి ఎంజాయ్‌ చేస్తాడు. 

This browser does not support the video element.

సేవా ఫౌండేషన్‌ ద్వారా అనాథలను, జంతువులను దత్తత తీసుకొని సంరక్షిస్తున్నారు. వీలు కుదిరినప్పుడల్లా నేరుగా అక్కడికెళ్లి పిల్లలతో సమయం గడుపుతారు.

కోల్‌కతా - హైదరాబాద్‌.. క్వాలిఫయర్‌ - 1 రికార్డులివే

ఐపీఎల్.. ఏ సీజన్‌లో ఏ ఏ జట్లు ప్లేఆఫ్స్‌కు

ఐపీఎల్‌.. ఏ సీజన్‌లో ఏ జట్టుకు చివరి స్థానం

Eenadu.net Home