‘మ్యాడ్’ హీరోయిన్ మన హైదరాబాదీయే..
‘మెయిల్’ అనే తెలుగు చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది శ్రీ గౌరి ప్రియ రెడ్డి . కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో ‘మ్యాడ్’ తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది.
తొలి చిత్రంతోనే తన నటనతో ఆకట్టుకున్న ఈమె ‘మనలో ఒకడు’, ‘నిర్మలా కాన్వెంట్’, ‘ఫిదా’ , ‘రైటర్ పద్మభూషణ్’ వంటి పలు చిత్రాల్లో నటించింది.
‘మోడ్రన్ లవ్ చైన్నై’ అనే తమిళ సినిమాలోనూ నటిస్తోంది. రజనీకాంత్ తన ఆల్‌టైమ్ ఫెవరెట్ అని చెబుతుంది.
మిస్ హైదరాబాద్‌గా 2018 లో టైటిల్ గెలుచుకుంది. మోడలింగ్ చేసిన ఈ హైదరాబాద్ బ్యూటీ.. నటన మీద ఆసక్తితో యాక్టింగ్ వైపు అడుగులు వేసింది.
సెంట్ ఫ్రాన్సిస్ ఉమెన్స్ కాలేజ్ లో బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ చదివింది.
‘రైటర్ పద్మభూషణ్’ లో ఆమె చేసిన కన్నా పాత్రకు మంచి మార్కులు పడ్డాయి.
This browser does not support the video element.
గౌరీ ప్రియ నటి మాత్రమే కాదండోయ్ సింగర్ కూడా.. చిన్నప్పుడే ‘బోల్ బేబీ బోల్’ షోలో పాల్గొని తన స్వరంతో శభాష్ అనిపించుకుంది.
తేజ దర్శకత్వంలో వచ్చిన ‘హోరాహోరీ’ , ‘మనలో ఒక్కడు’ లో గాయనిగా అభిమానులను మెప్పించింది.
ఏ కాస్త సమయం దొరికినా డ్యాన్స్ చేస్తుంది. పుస్తకాలను చదువుతుంది. పెయింటింగ్, ఫొటోగ్రఫీ తన హాబీస్.
భారతీయ ఆహారంతో పాటు చైనీస్ , జపనీస్ ఫుడ్‌ని ఇష్టంగా తింటుంది.