పుట్టింది కేరళ.. చదివింది హైదరాబాద్‌..!

మహిమా నంబియార్‌.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా.. ! తమిళ, మలయాళ చిత్రాల్లో ఎక్కువగా నటిస్తోంది. రాఘవ లారెన్స్‌, కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రల్లో వస్తోన్న ‘చంద్రముఖి 2’లో మహిమ కీలకపాత్ర పోషిస్తోంది. 

‘చంద్రముఖి 2’తో ఈ బ్యూటీ టాలీవుడ్‌లోనూ కనిపించనుంది.

తమిళంలో విజయ్‌ ఆంటోనీ ‘రత్తం’లోనూ తనది ముఖ్యపాత్ర.

This browser does not support the video element.

క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్‌ జీవిత కథగా తెరకెక్కుతున్న ‘800’లో మహిమ ప్రధాన పాత్ర పోషిస్తోంది.  

‘లారెన్స్ మాస్టర్‌కి నేను వీరాభిమానిని. ఒక్క సారైనా ఆయనతో కలసి ఫ్రేమ్‌లో కనిపించాలనుకున్నా. కానీ స్టెప్పులేసే అవకాశమే లభించింది. కంగనా మేడంతో తెరను పంచుకోవడం సంతోషంగా ఉంది. ఈ చిత్రం టాలీవుడ్‌లో నాకు గొప్ప ఓపెనింగ్‌’ అంటోంది మహిమ.

డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం. డ్యాన్స్‌ ద్వారానే మోడలింగ్‌లోకి ఆ తర్వాత పదిహేనేళ్ల వయసులోనే యాక్టింగ్‌లోకి అడుగుపెట్టింది. 

కేరళలో పుట్టి పెరిగిన మహిమ హైదరాబాద్‌లోని ఫ్రాన్సిస్‌ ఉమెన్స్‌ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. మలయాళ చిత్రం ‘కార్యస్థాన్‌’లో బాలనటిగా కనిపించింది. 

మహిమ మంచి డ్యాన్సరే కాదు, పాటలూ పాడుతుంది. తీరిక దొరికితే చాలు.. సంగీతాన్ని ఆస్వాదిస్తుంది. పుస్తకాలు చదవడం, స్విమ్మింగ్‌ చేయడం తన హాబీస్‌ అని చెప్తుంది. 

This browser does not support the video element.

తెలంగాణలో చదువుకున్న మహిమకి ఫాస్ట్‌ఫుడ్, పానీపూరీ, పిజ్జా అంటే ఇష్టం. విహారానికి వెళ్లాలంటే లండన్‌, దుబాయ్‌, సింగపూర్‌ తన ఛాయిస్‌ అంటుంది.

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home