మాయ చేసే మాల్వీ మల్హోత్రా..

‘తిరగబడరసామీ..’ అంటూ తెలుగులో కి వస్తోన్న నాయిక మాల్వీ మల్హోత్రా. ఈ చిత్రంలో రాజ్‌తరుణ్‌ సరసన నటిస్తోంది.

(photos:instagram)

ఎ.ఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు. ఒకరు మల్హోత్రా, ఇంకొకరు మన్నారా చోప్రా.

యాక్షన్‌ జోనర్‌లో వస్తోన్న ఈ చిత్రం టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. ఇందులో తన పాత్ర ప్రత్యేకంగా ఉంటుందని మాల్వీ చెప్పుకొచ్చింది.

మాల్వీ పుట్టింది హిమాచల్‌ ప్రదేశ్‌లో... చంఢీగఢ్‌లో ఎంసీఏ చేసింది. 

స్కూల్లో ఉన్నప్పటి నుంచే తనకి యాక్టింగ్‌, మోడలింగ్‌ అంటే ఆసక్తి ఉండేదట. 2015లో కాలేజీలో ఇచ్చిన స్టేజీ ప్రదర్శనతో సినిమాల్లో అవకాశం వచ్చిందట.

ముంబయిలోని నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామాలో యాక్టింగ్‌ స్కిల్స్‌ నేర్చుకుంది. న్యూస్‌ యాంకర్‌గా చేసింది.

హిందీలో ‘ఉడాన్‌’తో 2017లో బుల్లితెరపై అడుగుపెట్టింది మల్హోత్రా.

బాలీవుడ్‌లో కామెడీ డ్రామా ‘హోటల్‌ మిలాన్‌(2018)’తో వెండి తెరపై కనిపించింది 

‘థామస్‌’, ‘జోర్‌వార్‌ ది జాక్వెలిన్‌’,‘అభ్యుహం’,తో అలరించింది. ప్రస్తుతం ‘తిరగబడరసామీ’ షూటింగులో బిజీగా ఉంది.

సినిమాల్లో అవకాశాలు తక్కువగానే ఉన్నా పలు మ్యూజిక్‌ వీడియోల్లో మెరిసింది. ‘డ్యాన్స్‌ సోనియే’, ‘గల్‌బాత్‌’, ‘కారోబార్‌’, ‘షైనింగ్‌ స్టార్’ వంటి పలు పాటలు బాగా వైరలయ్యాయి.

This browser does not support the video element.

ఖాళీ సమయం దొరికితే కవితలు రాస్తూ, పుస్తకాలు చదువుతూ సమయం గడిపేస్తుంది. వీటితో పాటు ఈమెకి పెయింటింగ్‌ వేయడమంటే చాలా ఇష్టం...!  

బ్యూటీల ఫిట్‌నెస్‌ మంత్ర

దక్షిణాది చిత్రసీమపై కన్నేసిన అనసూయ

గోల్డెన్‌ బ్యూటీ.. జాన్వీ

Eenadu.net Home