పులులు ‘మ్యాన్‌ ఈటర్స్‌’గా ఎందుకు మారతాయి?

ఇటీవల కేరళలో ఓ పులి మనిషిని వేటాడి, సగం శరీరాన్ని తినేసింది. దీంతో ఆ పులిని పట్టుకోలేకపోతే చంపేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అసలీ మ్యాన్ఈటర్స్‌ ఏంటో తెలుసుకుందామా..!

అభయారణ్యాలు అనగానే పులులే గుర్తొస్తాయి. ఒక్కోసారి మనుషులు నివసించే ప్రాంతాలకు దగ్గర్లోనే వాటి ఆవాసాలు ఉంటాయి.

కట్టెల కోసమో, ఆహారానికో ఇంకేదో అవసరమై మనుషులు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లాల్సి రావొచ్చు. అలాంటప్పుడు అవి దాడి చేస్తాయి.

కొన్ని పులులు మనుషులపై దాడి చేసి, చంపేస్తాయి. కానీ తినవు. మరికొన్ని తింటాయి. పుట్టుకతోనే ఇవి మ్యాన్ఈటర్స్ కాదు.. అలా మధ్యలో మారతాయి.

వేటాడేందుకు దగ్గర్లో జంతువులు లేనప్పుడు, వాటికి విపరీతంగా ఆకలి పెరిగినప్పుడు మనుషుల్ని తింటాయి.

కొన్నింటికి వయసు పెరిగే కొద్దీ శక్తి తగ్గిపోతుంది. అలాంటప్పుడు మనుషుల వెంట పరుగెత్తి తేలికగా తినేయొచ్చు కాబట్టి ఈ మార్గాన్ని ఎంచుకుంటాయట.

కొన్ని సార్లు పులి పిల్లలు కనిపించకపోయినా, వాటికి ఏదయినా ఆపద తలెత్తినా అవి ఉగ్రరూపం దాలుస్తాయి. ఆ సమయంలో మనుషుల్ని చంపి తినేందుకూ వెనకాడవు.

శక్తి లేని సమయంలో అవి ఎంచుకునే మార్గమే మానవ వేట. ఆ సమయంలో జనావాసాలకు దగ్గరగా వస్తాయి. మనుషుల కదలికలను కనిపెడుతూ ఉంటాయి.

ముసలి పులుల్ని, గాయాలతో ఉన్నవి, వేటాడలేని వాటిని ఆధిపత్య పులులు వాటి గుంపులో నుంచి బయటకు తరమేస్తాయని ఫారెస్ట్‌ అధికారులు చెబుతున్నారు..

ఒక ఆడపులి 1900 సంవత్సరంలో నేపాల్‌, భారత్‌లో ఎనిమిదేళ్ల వ్యవధిలో 400కంటే ఎక్కువ మందిని చంపింది. చంపావత్ టైగ్రెస్ అనే పులిని బ్రిటిష్ వేటగాడు జిమ్ కార్బెట్ అంతమొందించాడు. 

పులుల జీర్ణవ్యవస్థలో మాంసం మాత్రమే జీర్ణం అవుతుంది. అవి శాకాహారులుగా మారే అవకాశమే ఉండదు. అందుకే వేటకు జంతువులు దొరకని సమయంలో మనుషుల్నీ వేటాడేందుకు పులులు సిద్ధమవుతాయి.

ఒత్తిడిని దూరం చేసే ఆయిల్‌ మసాజ్‌

కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఈ లక్షణాలు ఉండాలి!

ఆకర్షణీయమైన నగరాల్లో టాప్-10 ఇవే!

Eenadu.net Home