యాక్షన్‌ చిత్రంతో మానస..

మానస వారణాసి.. అశోక్‌ గల్లా సరసన ఓ యాక్షన్‌ చిత్రంతో టాలీవుడ్‌లో తెరంగేట్రం చేయనుంది. అర్జున్‌ జంధ్యాల దర్శకత్వంలో వస్తున్న చిత్రమిది.

(photos: instagram)

‘సత్యభామ’ అనే పాత్రను మానస పోషిస్తుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఆమె లుక్‌తో పోస్టర్‌ని విడుదల చేసింది.

ఇంతకీ ఈ అమ్మాయి ఎవరంటారా..! 2020లో ఫెమినా మిస్‌ ఇండియా పోటీల్లో టైటిల్‌ గెలుచుకుంది. 2021లో భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించి మిస్‌వరల్డ్‌ పోటీల్లో రన్నరప్‌గా నిలిచింది.  

మానస హైదరాబాద్‌(1997)లో పుట్టింది. వాసవి ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ చేసింది.

స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్‌ పోటీలు, డ్యాన్స్‌ లాంటి ఎక్సట్రా కల్చరల్‌ యాక్టివిటీస్‌లో యాక్టివ్‌గా పాల్గొనేది.

2000లో ప్రియాంక చోప్రా మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని గెలుచుకోవటం తనకి బాగా నచ్చిందట. ఆమెను ఆదర్శంగా తీసుకొని ఎప్పటికైనా ఆ కీరీటాన్ని గెలుచుకోవాలనుకుందట.

కాలేజీలో బ్యూటీక్వీన్‌ టైటిల్‌ గెలుచుకున్న సందర్భమే ఆమెను మోడలింగ్‌ వైపు అడుగులేసేలా చేసింది. రోటరీ క్లబ్‌లో కమిటీ మెంబర్‌గా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా వాటిలో పాల్గొనేది.

మోడలింగ్‌ చేస్తూనే ఉద్యోగమూ చేసిన మానస 2019లో మిస్‌ తెలంగాణగా నిలిచింది. ఆ తర్వాత ఫెమినా మిస్‌ ఇండియా పోటీల్లో టైటిల్‌ దక్కించుకుంది.

మానసకి అడ్వెంచర్లు చేయడం ఇష్టం. ఎక్కడికైనా ట్రిప్పులకి వెళ్లాలంటే ట్రెక్కింగ్‌ ఎంచుకుంటుంది. కర్ణాటకలో అన్నిటికంటే ఎత్తైన ముల్యాంగిరి కొండను సునాయాసంగా ఎక్కేసిందట.  

మానసని ఏ విషయంలోనైనా రాజీపడేలా చేయగలిగేది, ఇన్‌ఫ్లూయెన్స్‌ చేయగలిగేది.. అమ్మ, చెల్లెలేనట. వారు చెప్తే ఏ విషయాన్నైనా అంగీకరిస్తానని ఓ సందర్భంలో తెలిపింది. 

This browser does not support the video element.

మానస సైగలతో మాట్లాడడం నేర్చుకుందట. ఇది కేవలం తన పట్టుదల వల్లే సాధ్యమైందని చెబుతుంది. 

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home