ఆ కారణంతో మంచి సినిమాలకు నో..!

‘హిట్ 2‌’తో తెలుగు తెరపై హిట్‌ కొట్టింది మీనాక్షి చౌదరి.. ప్రస్తుతం ‘గుంటూరు కారం’తో ఘాటుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంలో ఇద్దరు నాయికలు. ఈ మూవీ సంక్రాంతికి విడుదల కానుంది.

‘అట్టా.. సూడకే..’ అంటూ ‘ఖిలాడీ’లో రవితేజ సరసన ఆడిపాడింది. డ్యాన్స్‌తో అభిమానుల్ని కట్టిపడేసింది. 

వరుణ్‌ తేజ్‌తో ‘మట్కా’లోనూ నటిస్తోంది. నోరా ఫతేహి మరో నాయిక. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్‌ చిత్రానికి కరుణ్‌ కుమార్‌ దర్శకుడు.

మిస్ ఇండియా టైటిల్‌(2018) గెలుచుకున్నాక యాక్టింగ్‌లోకి అడుగు పెట్టింది. ‘ఇచట వాహనములు నిలుపరాదు’ తన మొదటి చిత్రం.

విశ్వక్‌సేన్‌ పదో చిత్రంలోనూ మీనాక్షి నటిస్తోంది. ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ ఖరారు కాలేదు.

This browser does not support the video element.

 మీనాక్షికి ట్రిప్పులంటే.. అడవులే గుర్తొస్తాయంటుంది. షూటింగ్‌లో బ్రేక్‌ వస్తే స్నేహితులతో కొండలు, అడవుల్లోకి వెళ్లి ప్రకృతిని ఆస్వాదిస్తుంది.  

అర్ధనగ్నంగా కనిపించే, కెమెరా ముందు ఇబ్బంది పడే సీన్లు ఏమైనా ఉంటే నో చెబుతానంటుంది. ఆ కారణంతో ఎన్నో మంచి కథల్ని వదులుకుంది.

‘‘టాలీవుడ్‌లో అగ్ర హీరోలతో నటించే అవకాశాలు వస్తున్నాయి.. చాలా హ్యాపీ. అవకాశాలు ఎన్నున్నా వాటిలో ఏది ఎంపిక చేసుకున్నామనేదే ముఖ్యం’’. 

This browser does not support the video element.

టాలీవుడ్‌లో నటిస్తున్నందుకు గర్వంగా ఉంది. పరిశ్రమ నాకు తల్లి లాంటిది. ‘హిట్‌ 2’లో ఒకే అవకాశం కెరియర్‌ని మలుపు తిరిగేలా చేసింది. ఇందులో ‘ఉరికే.. ఉరికే..’పాట తన ఫేవరెట్‌ సాంగ్‌.

ఆయనే నా డ్యాన్స్‌ టీచర్‌

మేనమామే అయినా 17 సార్లు ఆడిషన్‌ ఇచ్చింది!

యూట్యూబ్‌ నుంచి కేన్స్‌ దాకా..

Eenadu.net Home