పదేళ్లకే ‘హనీ’ ర్యాంప్‌ వాక్‌...

‘ఎఫ్‌ 2, ఎఫ్‌ 3’ చిత్రాలతో.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన భామ మెహ్రీన్‌ ఫిర్‌జాదా ఇప్పుడు ‘స్పార్క్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కథ యాక్షన్‌ థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కుతోంది. నవంబరు 17న విడుదల కానుంది. 

‘స్పార్క్‌’కి విక్రాంత్‌ దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా పరిచయమవ్వనున్నాడు. ఈ సినిమాలో మరో నాయిక రుక్సార్‌ థిల్లాన్‌. ఈ చిత్రంలోని ‘ఏమా అందం’ పాట సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

‘మహానుభావుడు’, ‘చాణక్య’, ‘అశ్వథ్థామ’, ‘మంచి రోజులు వచ్చాయి’, ‘నోటా’, ‘పంతం’, ‘కవచం’, ‘ఎంత మంచి వాడవురా’ చిత్రాలతో ఆకట్టుకుంది.

This browser does not support the video element.

 మెహ్రీన్‌ 2016లో ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’తో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో ఆమె చేసిన మహాలక్ష్మి పాత్రకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. 

 ‘ఎఫ్‌ 2, ఎఫ్‌ 3’ సినిమాల్లో ‘హనీ ఈజ్‌ ద బెస్ట్‌’ డైలాగ్‌తో తెలుగు వారికి మరింత చేరువైంది. 

‘మంచి రోజులు వచ్చాయ్‌’లో సంతోష్‌ శోభన్‌తో ‘సో సోగా ఉండే లైఫే..’ పాటతో మెహ్రీన్‌ మరింత వైరల్‌ అయ్యింది. ఆ పాటే తన ఫేవరెట్‌ సాంగ్‌. 

హరియాణా మాజీ ముఖ్యమంత్రి మనవడు భవ్య బిష్ణోయ్‌తో మెహ్రీన్‌కు ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. కొన్ని కారణాల వల్ల నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. 

‘ఎఫ్‌ 3’ తర్వాత అవకాశాలు తగ్గడంతో..ఫిట్‌నెస్‌ని పట్టించుకోలేదు. విహారయాత్రలతో ఎంజాయ్‌ చేసింది. దాంతో బరువు పెరిగింది. ఇప్పుడు మళ్లీ అవకాశాలు వస్తుండటంతో కసరత్తులు చేసి నాజూగ్గా తయారయ్యానని చెప్పుకొచ్చింది.

మెహ్రీన్‌కి ఫొటోషూట్స్‌ అంటే ఇష్టం. రకరకాల దుస్తులు ధరించి ఫొటోషూట్స్‌లో పాల్గొంటుంది. తన ఇన్‌స్టా ఖాతాకి 25 లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు.

పదేళ్ల వయసులో ర్యాంప్‌ వాక్‌ చేసిన మెహ్రీన్‌కి మోడలింగ్‌లో అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టానంటుంది.

This browser does not support the video element.

మెహ్రీన్‌కి స్కైడైవింగ్‌, ట్రెక్కింగ్‌ అంటే ఇష్టం. ఖాళీగా ఉంటే సాహసయాత్రలకు సై అంటుంది.

ఈ వారం.. సందడి వీరిదే..

చదివింది ‘లా’.. నటనతో ఆకట్టుకునేలా!

పుట్టింది కేరళ.. చదివింది హైదరాబాద్‌..!

Eenadu.net Home