‘మామా మశ్చీంద్ర’తో మృణాళిని..

మృణాళిని రవి ‘గద్దలకొండ గణేష్‌’తో బుజ్జమ్మగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం సుధీర్‌ బాబు సరసన ‘మామా మశ్చీంద్ర’లో హీరోయిన్‌. దీనికి హర్షవర్ధన్‌ దర్శకుడు.

ఇందులో సుధీర్‌ది డ్యూయెల్‌ రోల్‌. ఈ చిత్రంలో మృణాళినితో పాటు ఈషా రెబ్బా మరో నాయిక. ఈ మూవీ అక్టోబరు 6న విడుదల కానుంది.

మృణాళిని తమిళం (2019)లో ‘సూపర్‌ డీలక్స్‌’తో తెరంగేట్రం చేసింది. ఈ మూవీ షూటింగ్‌ జరుగుతుండగానే తెలుగులో ‘గద్దలకొండ గణేష్‌’లో అవకాశం లభించింది.

ఈమె మైసూర్‌(1995)లో పుట్టింది. ఇంజినీరింగ్‌ చేసింది. టిక్‌టాక్‌తో క్రేజ్‌ తెచ్చుకున్న తర్వాత మృణాళిని మోడలింగ్‌ వైపు అడుగులేసింది. 

‘ఛాంపియన్‌’, ‘ఎనిమీ’, ‘ఎంజీఆర్‌ మగన్‌’, ‘జాంగో’, ‘కోబ్రా’, ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్‌ అల్లుడు’ చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకుంది. విజయ్‌ ఆంటోనితో ‘రోమియో’లోనూ నటిస్తోంది. 

This browser does not support the video element.

విశాల్‌ సరసన నటించిన ‘ఎనిమీ’లో ‘మాల డమ్‌ డమ్‌.. మంజర్‌ డమ్‌ డమ్‌..’ పాటకి మృణాళిని చేసిన డ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో వైరలయ్యింది.

మృణాళిని ఫ్యాషన్‌లో ఎప్పుడూ ఓ అడుగు ముందే ఉంటుంది. వివిధ రకాల దుస్తులు ధరించి ఫొటో షూట్స్‌లో పాల్గొని వాటిని సోషల్‌మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. 

This browser does not support the video element.

మృణాళినికి ట్రావెలింగ్‌ అంటే ఇష్టం. ఏదైనా ప్రాంతానికి వెళ్తే అక్కడ రీల్స్‌ చేసి వాటిని సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తుంది. 

ఈ కన్నడ భామకి తెలుగువారి పండగలన్నా, సంప్రదాయాలన్నా ఇష్టం. పండగ వచ్చిందంటే ఇంట్లో ఆ హడావుడి తప్పకుండా ఉండాల్సిందేనని చెబుతుంది. 

మృణాలినికి ఆలయాలను సందర్శించడం అంటే ఇష్టం. సంప్రదాయ చీరకట్టూ నచ్చుతుంది. 

నెక్సా వేదికపై అందాల తారలు..

‘సరిపోదా శనివారం’లో తమిళ నటి

మోస్ట్‌ పాపులర్‌ హీరోయిన్స్‌

Eenadu.net Home