నాగ్‌ ‘వరలక్ష్మి’ గురించి తెలుసా..?

This browser does not support the video element.

నాగార్జున హీరోగా వచ్చిన చిత్రం ‘నా సామి రంగ’. ఇందులో నాయిక ఆషికా రంగనాథ్‌. ‘వరలక్ష్మి’ పాత్రలో ఆకట్టుకుందీ భామ.

ఆషిక ‘అమిగోస్‌’లో కల్యాణ్‌ రామ్‌ సరసన నటించింది. ఓ ఈవెంట్‌లో పాల్గొనడానికి హైదరాబాద్‌ వస్తే ‘అమిగోస్‌’ దర్శకుడు ఫోన్‌లోనే కథ వినిపించి నాయికగా ఎంపిక చేశారట. 

ఈమె కర్ణాటకలో జన్మించింది. బెంగళూరులో డిగ్రీ పూర్తి చేసింది. అసలు సినిమాల్లోకి వచ్చే ఆలోచనే లేదు అంటుంది ఆషికా.

‘కాలేజీ అందాల పోటీల్లో పాల్గొంటే క్లీన్‌ అండ్‌ క్లియర్‌ ఫ్రెష్‌ ఫేస్‌గా గుర్తింపు వచ్చింది. ఆ పోటీల్లో నన్ను చూసిన డైరెక్టర్‌ ‘క్రేజీబాయ్‌’ కన్నడ సినిమాలో అవకాశం ఇచ్చారు. అలా తెరపై మెరిశాను’ అని చెబుతోందీ బ్యూటీ.

నటనలోనే కాదు.. డ్యాన్స్‌లోనూ శిక్షణ తీసుకుంది. కాలేజీలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పలు ప్రదర్శనలు ఇచ్చింది. ఫ్రీస్టైల్‌, బెల్లీ, వెస్టర్న్‌ డ్యాన్స్‌ విభాగాల్లో ఆషికకు ప్రావీణ్యం ఉంది.

పునీత్‌ రాజ్‌కుమార్‌కి ఈమె వీరాభిమాని. పరిశ్రమలోకి వచ్చీ రాగానే పునీత్‌ సినిమాలో నటించేందుకు అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషపడింది. ఆయన మరణంతో చాలా బాధపడింది.

‘తెలుగు బాగానే అర్థం అవుతుంది. చిన్నప్పటి నుంచీ నాన్నతో కలిసి తెలుగు సినిమాలు చూడటం, పాటలు వినడం చేసేదాన్ని. ఎక్కువగా చూసిన సినిమాలు ‘బొమ్మరిల్లు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’’ 

 ఆషిక పుస్తకాలు ఎక్కువగా చదువుతుంది. స్ఫూర్తినిచ్చే జీవిత గాథలు, కొటేషన్లూ, మోటివేషన్‌ స్పీచ్‌లూ వింటూ జీవితంలో ఎప్పటికప్పుడు మార్పు కోసం ప్రయత్నిస్తూ ఉంటానంటోంది.

This browser does not support the video element.

ఈ బ్యూటీ ఫిట్‌గా ఉండేందుకు ఎక్కువగానే కష్టపడుతుంది. ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. వారానికి నాలుగు రోజులు జిమ్‌లో రెండేసి గంటలు కఠిన వర్కౌట్లు చేస్తుంది.

‘రాజమౌళి దర్శకత్వం చాలా ఇష్టం. ఆయన సినిమాల్లో ఒక్కసారైనా నటించాలని ఉంది. రణ్‌బీర్‌ కపూర్‌ అంటే చిన్నప్పట్నుంచే క్రష్‌ అని చెబుతోంది’ ఆషిక.

This browser does not support the video element.

ఈమెకి రీల్స్‌ చేయడం చాలా ఇష్టం. స్నేహితులతో రీల్స్‌ చేస్తూ వాటిని ఇన్‌స్టాలో పంచుకుంటుంది.

ఈ హీరోయిన్లు ఏం చదివారో తెలుసా?

క్యాడ్‌బరీ బ్యూటీ.. మూడు సినిమాలతో బిజీ..

స్పెషల్‌ అట్రాక్షన్‌ సీరత్‌ కపూర్‌

Eenadu.net Home