రెండు దశాబ్దాలైనా అదే క్రేజ్..
రెండు దశాబ్దాలుగా అగ్రస్థానంలో హీరోయిన్‌గా కొనసాగడం అంటే మామూలు విషయం కాదు..! 2003లో సినీ రంగంలో అడుగుపెట్టిన నయనతార ఇప్పటికీ అదే జోరును కొనసాగిస్తోంది. నవంబరు 18న ఈ బ్యూటీ పుట్టినరోజు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దామా..
This browser does not support the video element.
‘జవాన్’తో మరోసారి ప్రేక్షకుల్లో తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకుంది ఈ కన్నడ బ్యూటీ. ఈ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టి హిట్ కొట్టింది. ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.
మలయాళంలో ‘మనసునక్కరే’తో 2003లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ‘చంద్రముఖి’లో రజనీకాంత్ సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
ఈ సౌత్ లేడీ సూపర్ స్టార్.. ‘బాస్’, ‘సింహ’, ‘రాజా రాణి’, ‘లక్ష్మీ’, ‘దుబాయి శీను’, ‘బిల్లా’, ‘అదుర్స్’, ‘బాబు బంగారం’, ‘జై సింహ’, ‘సైరా నరసింహారెడ్డి’, ‘విశ్వాసం’ వంటి పలు చిత్రాల్లో అగ్రహీరోలందరితో నటించి గొప్ప విజయాలు అందుకుంది.
నయనతార నటి మాత్రమే కాదు నిర్మాత కూడా..! ఐదు చిత్రాలకు పైగా నిర్మాతగా వ్యవహరించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 74 చిత్రాల్లో తన నటనతో అలరించింది.
డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌తో 2015 నుంచి ప్రేమలో ఉంది. 2022లో పెద్దల అంగీకారంతో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. సరోగసీ ద్వారా ఉయిర్, ఉలగమ్ అనే ఇద్దరు కవలలకు తల్లయింది.
‘పెళ్లయిన తర్వాత మహిళల జీవితంలో చాలా మార్పులు వస్తాయి. ఇంటిని చూసుకుంటూ ఉద్యోగం చేయడం కష్టంగానే ఉంటుంది. కానీ సొంతగా గుర్తింపు తెచ్చుకోవాలన్నా, ఎదగాలనే.. ఆశయం ఉన్నా.. అన్నింటినీ తేలికగా మేనేజ్ చేయొచ్చు’ అని చెబుతోందీ భామ.
నయన.. భర్తతో కలిసి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. ‘9 స్కిన్’ పేరుతో స్కిన్ కేర్ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
నయన 75వ చిత్రం ‘అన్నపూరణి’. ఇందులో ఆమె ‘పూర్ణి’గా రకరకాల వంటలు చేస్తూ అలరించనుంది. ఈ చిత్రం డిసెంబరు 1న విడుదల కాబోతుంది.
మంచు విష్ణు ‘కన్నప్ప’లో ప్రభాస్ సరసన పార్వతీ దేవిగా కనిపించనుంది. సిద్ధార్థ్, మాధవన్‌తో ‘టెస్ట్’లోనూ నటిస్తోంది. మణిరత్నం - కమల్‌హాసన్ #234 సినిమాలోనూ నయనతారే నాయిక.
‘క్రిస్టియన్ కుటుంబంలో జన్మించిన నేను.. బాలకృష్ణ గారితో ‘శ్రీరామ రాజ్యం’లో సీతగా నటించడానికి ముందే 2011లోనే హిందూ మతంలోకి మారాను. అప్పటి నుంచీ హిందువుల పండుగలను, సాంప్రదాయాలను ఆచరిస్తున్నాను. ప్రతి పండుగకి ఇంట్లో హడావుడి చేస్తూ పూజలు నిర్వహిస్తాను’ అంటుంది నయన.
కుటుంబంతో కలసి ఎక్కువగా విహారయాత్రలకు వెళ్తుంది. ఇటీవల మలేషియా ట్రిప్‌కి వెళ్లింది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన ఇన్‌స్టా ఖాతా ఫాలోవర్లు 6లక్షల మంది.