అట్లుంటది రాధికతోని..!
తన అసలు పేరుతో పిలిస్తే ఎవరూ గుర్తుపట్టకపోవచ్చు.. కానీ, ‘డీజే టిల్లు’ రాధిక అని చెబితే ఠక్కున గుర్తుపట్టేస్తారు. అంతలా ఆ పాత్రతో పాపులరైంది నేహా శెట్టి.
image:Instagram/iamnehashetty
సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన ఆ చిత్రంలో నేహా శెట్టి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. రాధికగానే ఆమెను గుర్తిస్తున్నారు.
image:Instagram/iamnehashetty
ప్రస్తుతం నేహా మరో యంగ్ హీరో కార్తికేయతో కలిసి ‘బెదురులంక 2012’లో నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. ఇందులోనూ హీరోతో రొమాన్స్ పండించనుంది.
image:Instagram/iamnehashetty
నేహా శెట్టి.. 1999 డిసెంబర్ 3న కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది.
image:Instagram/iamnehashetty
మోడలింగ్‌తో కెరీర్‌ను ప్రారంభించిన నేహా.. 2014లో మిస్ మంగళూరు అందాల పోటీలో విజేతగా నిలిచింది.
image:Instagram/iamnehashetty
శశాంక్ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘ముంగారు మలే 2’లో తొలిసారిగా నటించింది.
image:Instagram/iamnehashetty
ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మెహబూబా’తో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా కోసం తెలుగు భాష నేర్చుకుందీ భామ. కానీ, పెద్దగా గుర్తింపు దక్కలేదు.
image:Instagram/iamnehashetty
రెండు సినిమాలు చేసిన తర్వాత మళ్లీ నటనలో శిక్షణ తీసుకునేందుకు న్యూయార్క్ ఫిల్మిం అకాడమీలో చేరింది. ఆరు నెలల పాటు శిక్షణ తీసుకుంది.
image:Instagram/iamnehashetty
భారత్‌కు తిరిగొచ్చాక.. 2021లో ‘గల్లీ రౌడీ’లో సందీప్ కిషన్‌కి జోడీగా.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో అతిథి పాత్రలో మెరిసింది.
image:Instagram/iamnehashetty
This browser does not support the video element.
‘డిజే టిల్లు’లో రాధిక పాత్రతో నేహా ఇండస్ట్రీని తనవైపునకు తిప్పుకొంది. ఆమె నటనకు తోటి నటీనటులు సైతం ప్రశంసల వర్షం కురిపించారు.
image:Instagram/iamnehashetty
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నేహాకు‘డీజే టిల్లు’తో ఫాలోయింగ్ పెరుగుతూ వస్తోంది. తరచూ తన అందమైన ఫొటోలను పోస్టు చేస్తూ కుర్రకారును ఆకట్టుకుంటోంది.
image:Instagram/iamnehashetty