గోవాలో ‘చిరుత’ బ్యూటీ!
రామ్‌చరణ్ నటించిన తొలి చిత్రం ‘చిరుత’తో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన నటి నేహాశర్మ.
Image: Instagram/NehaSharma
వరుణ్ సందేశ్‌తో ‘కుర్రాడు’లో నటించిన ఈ భామ.. మళ్లీ తెలుగుతెరపై కనిపించలేదు. అయినా.. సోషల్‌మీడియా ద్వారా అభిమానులకు, నెటిజన్లకు చేరువగానే ఉంటోంది.
Image: Instagram/NehaSharma
ప్రస్తుతం నేహా గోవా ట్రిప్‌లో ఉంది. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
Image: Instagram/NehaSharma
బీచ్ అందాల్ని ఆస్వాదిస్తూ.. సముద్రంలో జలకాలాడుతూ ఎంజాయ్ చేస్తోంది.
Image: Instagram/NehaSharma
టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కి వెళ్లిన నేహా.. 2009లో వచ్చిన ‘క్రూక్’లో నటించింది.
Image: Instagram/NehaSharma
ఆ తర్వాత అవకాశాలు రావడంతో అక్కడే స్థిరపడింది. మలయాళం, తమిళ్, పంజాబీ చిత్రాల్లోనూ మెరిసింది.
Image: Instagram/NehaSharma
‘ఇల్లీగల్’ అనే వెబ్‌సిరీస్‌లో లాయర్‌గా నటించి మెప్పించింది. ‘షైనింగ్ విత్ శర్మాస్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది.
Image: Instagram/NehaSharma
నేహాకు విహారయాత్రలు చేయడమంటే చాలా ఇష్టం. ‘నేహా ట్రావెల్ డైరీస్’ పేరుతో తను సందర్శించిన ప్రాంతాలకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తుంటుంది.
Image: Instagram/NehaSharma
తను ఎక్కడికి వెళ్లినా.. తన సోదరి ఐశా శర్మతో కలిసే వెళ్తుంది. ఇప్పటి వరకు ఈ ఇద్దరూ కలిసి దేశవిదేశాల్లోని అనేక సందర్శక ప్రాంతాలకు వెళ్లొచ్చారు.
Image: Instagram/NehaSharma
ఇటీవల వీరిద్దరూ దుబాయ్‌కి వెళ్లి.. పలు అడ్వెంచర్స్ చేశారు. చిట్టి హెలికాప్టర్లో ఎక్కిన నేహా దుబాయ్ ఆకాశ వీధుల్లో చక్కర్లు కొట్టింది.
Image: Instagram/NehaSharma