టైగర్‌ ప్రేయసి.. నూపుర్‌..

నూపుర్‌ సనన్‌.. కృతి సనన్‌ చెల్లెలు. తనొక మోడల్‌, సింగర్‌, ఇప్పుడు యాక్టర్‌ కూడా అయ్యింది. రవితేజ పాన్‌ ఇండియా చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’లో హీరోయిన్‌గా నటిస్తోంది.

(photos: instagram)

ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. దసరాకి ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో రవితేజ సరసన నూపుర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

‘టైగర్‌..’ ప్రేయసి సారా పాత్రలో నూపుర్‌ కనిపించనుంది. ఈమె ఫస్ట్‌లుక్‌ని తాజాగా విడుదల చేశారు. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

మంచువిష్ణు సరసన ‘కన్నప్ప..’ చిత్రంలో కూడా నటించేందుకు ఛాన్స్‌ కొట్టేసింది ఈమె. అత్యధిక బడ్జెట్‌తో మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీగా అంచనాలు పెట్టుకుందట...

This browser does not support the video element.

బాలీవుడ్‌లో ‘నూరాని చెహ్రా’లో కూడా నూపుర్‌ కథానాయికగా చేస్తోంది. నవనీత్‌ సింగ్‌ దర్శకత్వంలో ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది.

నూపుర్‌ దిల్లీ(1993)లో పుట్టింది. చదువంతా స్థానికంగానే సాగింది. దిల్లీ యూనివర్శిటీలో ఎమ్మెస్సీ చేసింది.

ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఉద్యోగం చేసింది. ఆ తర్వాత మేనేజ్‌మెంట్‌ ట్రైనీగానూ జాయిన్‌ అయ్యింది.

నూపుర్‌ మొదటిసారిగా 2015లో ప్రైవేట్‌ ఆల్బమ్స్‌లో ‘బేకరర్‌ కర్కే’, ‘తేరి గాలియన్‌’ అనే పాటలు పాడింది. ఇవి రెండూ యూట్యూబ్‌లో వైరల్‌గా మారాయి.

బాలీవుడ్‌ చిత్రం ‘దిల్‌వాలే..’లో ‘జనమ్‌ జనమ్‌..’ అనే పాటతో అరంగేట్రం చేసింది. ఈ చిత్రం, ఇందులోని పాటలు గొప్ప విజయాన్ని అందుకున్నాయి.

బాలీవుడ్‌ ప్రముఖ హీరో అక్షయ్‌కుమార్‌తో కలసి నూపుర్‌ ‘ఫిలాల్‌’ పాటకు సీక్వెల్‌గా ‘ఫిలాల్‌ 2’వీడియో పాటను 2021లో విడుదల చేసింది. ఈ పాటకు మంచి రెస్పాన్స్‌ రావటంతో సినిమాల్లో నటించేందుకు అవకాశం లభించింది.

అంతేకాకుండా నూపుర్‌ పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ట్రావెలింగ్‌ అంటే చాలా ఇష్టమట. స్పోర్ట్స్‌, స్విమ్మింగ్‌ యాక్టివ్‌గా చేస్తుందట.

This browser does not support the video element.

సోదరితో పాటు ట్రిప్పులకి వెళ్లి సరదాగా ఎంజాయ్‌ చేయడమంటే చాలా ఇష్టమట. కృతితో చేసిన రీల్స్‌, ఫొటోషూట్‌లు సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తూ ఉంటుంది. నూపుర్‌కి ఇన్‌స్టాలో 9.2 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు. 

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home