వయ్యారాల గ్యాంగ్‌స్టర్ ప్రియాంక..
విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన నాని ‘గ్యాంగ్‌లీడర్’తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక అరుళ్ మోహన్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన ‘ఓజీ’లో హీరోయిన్‌గా నటిస్తోంది.
‘ఓజీ’కి సుజీత్ దర్శకుడు. యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో పవన్ గ్యాంగ్‌స్టర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో తన పాత్ర విభిన్నంగా ఉంటుందని చెబుతోంది ప్రియాంక..
హీరో ధనుష్ సరసన ‘కెప్టెన్ మిల్లర్’లోనూ నటిస్తోంది. ఈ చిత్రాన్ని పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో రూపొందిస్తున్నారు.
ఇప్పటి వరకూ సాఫ్ట్ క్యారెక్టర్స్ చేసిన ప్రియాంక తొలిసారిగా ఈ సినిమాలో యాక్షన్ అవతారమెత్తింది. తుపాకీ పట్టుకొని యుద్ద రంగంలోకి దిగింది.
2019లో కన్నడలో వచ్చిన ‘ఒందు కథే హెల్ల’ చిత్రంతో తెరంగేట్రం చేసింది ఈ కన్నడ బ్యూటీ.
ఆ తర్వాత వచ్చిన ‘గ్యాంగ్‌లీడర్’లో అందం, అమాయకత్వంతో మాత్రంప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
శర్వానంద్ సరసన ‘శ్రీకారం’తో తెలుగు అభిమానులకు మరింత చేరువైంది.
‘వరుణ్ డాక్టర్’, ‘డాన్’, ‘ఈటీ: ఎవరికీ తల వంచడు’, ‘జూనియర్ 30’ తదితర చిత్రాల్లో తన నటనతో మెప్పించింది.
చెన్నైలో పుట్టి పెరిగిన ఈ భామకి పారిస్ నగరం అంటే చాలా ఇష్టం.. విహారయాత్రకి పారిస్ వెళ్తే అక్కడ దొరికే ఆహారాన్ని ఆస్వాదిస్తూ.. షాపింగ్ చేస్తుంది.
సంప్రదాయ చీరకట్టు అంటే ప్రియాంకకు బాగా నచ్చుతుందట. ఇన్‌స్టాలోనూ ఎక్కువగా చీరకట్టులో ఉన్న ఫొటోలనే పంచుకుంటూ ఉంటుంది.