ప్రేమ దేశపు యువరాణి..
ప్రియాంక రెవ్రి. 2019లో ‘కాలా షా కాలా’తో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ‘ప్రేమ దేశపు యువరాణి’తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం సెప్టెంబరు 2న విడుదల అయ్యింది.
చిన్నప్పట్నుంచే ప్రియాంకకు నటనపై ఉన్న ఆసక్తితో ప్రకటనల కోసం ఫొటోషూట్స్‌లో పాల్గొనేది. అలా తన టాలెంట్‌ని ప్రూవ్ చేసుకోవాలంటే సోషల్‌మీడియానే సరైన వేదిక అనుకుంది.
This browser does not support the video element.
టిక్‌టాక్‌లో వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత ఇన్‌స్టాలో ఫొటోలతో ఆకట్టుకుంది. అదే తెలుగు చిత్ర పరిశ్రమకు దారి వేసింది.
ఇన్‌స్టాలో గ్లామర్ ఫొటోలను పోస్టు చేస్తూ... సందడి చేస్తూ ఉంది. డ్యాన్స్‌రీల్స్, ఫొటో షూట్‌లు ఆమె సోషల్‌మీడియాలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈమెకు ఇన్‌స్టాలో లక్షన్నర మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
భోజ్‌పురి స్టార్ హీరో అరవింద్ ఆకేలా సరసన ‘కల్లు’లో నటిస్తోంది. ఈ సినిమాలో ప్రియాంక లుక్స్ అట్రాక్టివ్‌గా ఉన్నాయని నెటిజన్ల టాక్.
ప్రియాంకకి తెలుగు సినిమాలంటే చాలా ఇష్టమట.. టాలీవుడ్‌లో నటించడానికే ఆసక్తి చూపిస్తుందట. ఈ మేరకు తెలుగు నేర్చుకునే పనిలో ఉందట.
పట్నా, ఝార్ఖండ్ అంటే ప్రియాంకకి బాగా ఇష్టమట. అక్కడ ప్రత్యేకంగా దొరికే కొన్ని అరుదైన వస్తువులని ఎక్కువగా కొనుగోలు చేస్తుందట.
డ్రైవింగ్ అంటే ప్రియాంకకి బాగా ఇష్టమట. అందులోనూ బైక్ రైడింగ్ అంటే ఎక్కువ ఆసక్తి . రాత్రి వేళల్లో రోడ్లపై రాయల్ ఎన్‌ఫీల్డ్ నడపడం బాగా నచ్చుతుందట.
చీరలంటే ప్రియాంకకి బాగా ఇష్టమట.. ప్రమోషన్స్‌కి, ఆడియో ఫంక్షన్స్‌కి, దేవాలయాలకి ఎక్కువగా చీరల్లోనే వెళ్తుంది.
This browser does not support the video element.
మంచు ప్రదేశాల్లో స్కేటింగ్ చేయడమంటే ప్రియాంకకి భలే ఆసక్తి. ‘కొంచెం రిస్కైనా ఫర్వాలేదు ట్రై చేయొచ్చు’ అన్న డైలాగ్‌ని దృష్టిలో పెట్టుకొని మంచులో రయ్‌రయ్ మంటూ స్కేట్ చేస్తుంది.
(sorce:instagram)