ఎక్స్‌ప్రెస్‌లా రకుల్‌ సినిమాలు..

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌..‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’తో టాలీవుడ్‌లో స్టార్‌ నాయుకగా మారింది. ప్రస్తుతం ‘మేరీ పత్ని కా రీమేక్‌’, ‘అయాలాన్‌’, ‘ఇండియన్‌ 2’ సినిమాలతో బిజీ బిజీగా ఉంది.

(photos: instagram)

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న కమల్‌ హాసన్‌ ‘ఇండియన్‌ 2’లో రకుల్‌తో పాటు కాజల్‌, ప్రియా భవానీ శంకర్‌, ఐశ్వర్య రాజేశ్‌ నటిస్తున్నారు. 

బాలీవుడ్‌లో అర్జున్‌ కపూర్‌ సరసన.. రకుల్‌, భూమి పెడ్నేకర్‌ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘మేరీ పత్ని కా రీమేక్‌’. బాలీవుడ్‌లో సరైన విజయం అందుకోని రకుల్‌కు ఈ సినిమా విజయం కీలకం.

This browser does not support the video element.

శివకార్తికేయన్‌ ‘అయాలన్’ పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ఏలియన్‌ ప్రధాన పాత్రగా వస్తున్న సినిమా ఇది. రవి కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ సంక్రాంతికి వస్తోంది. 

‘‘భాషలు, ప్రాంతాలనే హద్దులు లేకుండా సినిమాలు చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. పాన్‌ ఇండియా స్థాయిలో అవకాశాలు వస్తున్నందుకు గర్వంగా ఉంది.’’ అంటూ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఆనందపడుతోంది.

This browser does not support the video element.

ముంబయిలో జరిగిన జన్మాష్టమి వేడుకల్లో మహారాష్ర్ట ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిందేతో రకుల్‌, జాకీ భగ్నానీ పాల్గొన్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున చేసే దహీ హండీ కార్యక్రమం అంటే ఇష్టమని చెప్పింది.

సినిమాలతో బిజీగా ఉన్నా.. రకుల్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఫొటోలు షేర్ చేస్తూ యువతను కట్టిపడేస్తుంది. ఇన్‌స్టాలో తనకి 2.3 కోట్ల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. 

జాకీ భగ్నానీతో రకుల్‌కి రిలేషన్‌లో ఉంది. వీరిద్దరి వివాహం ఈ నవంబరులో జరగనుందని రూమర్స్‌ వచ్చాయి. ‘‘వివాహం ఎప్పుడు జరగాలనుంటే అప్పుడే జరుగుతుంది. దానికి కంగారెందుకు’’ అంటూ రూమర్స్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టింది. 

పనిలో ఒత్తిడిగా అనిపించినప్పుడు రకుల్‌ హార్స్‌ రైడింగ్‌ చేయడానికి ఇష్టపడుతుంది. అంతేకాదు.. ఈమె మంచి గోల్ఫ్‌ ప్లేయర్‌ కూడా. 

This browser does not support the video element.

రకుల్‌కి ట్రిప్పులకి వెళ్లడం అంటే ఇష్టం. కుటుంబ సభ్యులు, స్నేహితులతో విహార యాత్రలకు వెళ్లి ప్రకృతిని ఆస్వాదించడానికి ప్రాధాన్యమిస్తుంది. 

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home