రష్మీ.. అందం ‘ఎక్స్‌ట్రా’ జబర్దస్త్
రష్మీ గౌతమ్.. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’ షోకి యాంకర్‌గా చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించింది.
image:Instagram/rashmigautam
నిజానికి రష్మీ సినిమాలతోనే కెరీర్ ప్రారంభించింది. 2002లో ‘హోలీ’తో తెరంగేట్రం చేసింది. చాలా సినిమాల్లో చిన్న పాత్రలు పోషించింది.
image:Instagram/rashmigautam
తాజాగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలోనూ కీలక పాత్రలో నటిస్తోంది.
image:Instagram/rashmigautam
సినిమాలతోపాటు పలు టీవీ కార్యక్రమాలకు యాంకర్‌గా చేసిన ఈమె.. ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’తో క్రేజ్ తెచ్చుకుంది. మొదట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా.. ఇప్పుడు స్టార్ యాంకర్‌గా కొనసాగుతోంది.
image:Instagram/rashmigautam
సుడిగాలి సుధీర్.. రష్మీ జోడి టెలివిజన్‌లో బాగా పాపులర్ అయింది. ఈ జంటకు అభిమానులూ ఉన్నారు.
image:Instagram/rashmigautam
ఈ అందాల సుందరి విశాఖపట్నంలో జన్మించింది. ఒడిషాలో పెరిగి పెద్దయిన ఈ భామ.. తెలుగు నేర్చుకొని మరీ వ్యాఖ్యాతగా రాణిస్తోంది.
image:Instagram/rashmigautam
ఇప్పటివరకు రష్మీ తెలుగు, తమిళంలో కలిపి 27 సినిమాల్లో నటించింది. ‘బస్తీ’లో ఓ ప్రత్యేక పాటకు స్టెప్పులేసింది.
image:Instagram/rashmigautam
ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫొటోలను పోస్టు చేస్తూ కుర్రకారుని ఆకట్టుకుంటోంది.
image:Instagram/rashmigautam
ఈ గ్లామర్ బ్యూటీకి ఇన్‌స్టాలో 4.6 మిలియన్ ఫాలోవర్లున్నారు. ఈమెకు ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది.
image:Instagram/rashmigautam
రష్మీ జంతు ప్రేమికురాలు.. కుక్కలంటే ఎంతో ఇష్టం. కరోనా లాక్‌డౌన్ సమయంలో వీధి కుక్కల ఆకలి తీర్చి మానవత్వాన్ని చాటుకుంది.
image:Instagram/rashmigautam
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. ఇటీవల అప్పుడే పుట్టిన దూడను తన తల్లి నుంచి దూరంగా పెడితే ఆ గేదె దూడ దగ్గరకు పరిగెడుతుంది. దీనికి ఏదేమైనా తల్లి తల్లే అంటూ క్యాప్షన్ జత చేసి ఓ పోస్టు పెట్టింది. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.
image:Instagram/rashmigautam
This browser does not support the video element.
ఇటీవల మాల్దీవులు సందర్శించేందుకు రష్మీ వెళ్లింది. అక్కడ దిగిన గ్లామర్ ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంది.
image:Instagram/rashmigautam
యాక్టర్ నందూతో కలిసి ‘బొమ్మ బ్లాక్ బస్టర్’లో ప్రధాన పాత్రలో మెరిసింది. ప్రస్తుతం టెలివిజన్లో పలు షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.
image:Instagram/rashmigautam