‘ప్రేమ్ కుమార్’తో రాశీ సింగ్..
రాశీసింగ్.. ఆది సాయికుమార్ ‘శశి’తో ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ‘ప్రేమ్‌కుమార్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఆగస్టు 18న విడుదలైంది.
(photos:instagram/rashi.real)
సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి అభిషేక్ మహర్షి దర్శకత్వం వహించారు. కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో రాశీ సింగ్ తన అందంతో ఆకట్టుకుంది.
ఇదివరకు ‘జెమ్’, ‘పోస్టర్’ తదితర చిత్రాలు చేసినా వాటితో రాశీకి అంతగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతం విడుదలైన ‘ప్రేమ్ కుమార్’తో కాస్త గుర్తింపు లభిస్తోంది.
తెలుగు అంతగా రాకపోయినా.. ఎక్కువ టేక్‌లు తీసుకోకుండా చాలా తేలికగా డైలాగ్స్ చెప్తుందని తనతో నటించిన నటులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఈ సుందరి తెలుగులో నటిస్తోన్న మరో చిత్రం ‘భూతద్దం భాస్కర నారాయణ’. ఇది ఆగస్టు 25న విడుదల కానుంది. శివ కందుకూరి ఇందులో హీరో.
క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ‘భూతద్దం..’లో తన పాత్ర ఆకట్టుకుంటుందని రాశీ చెబుతోంది.
ఈ బ్యూటీ.. టాలీవుడ్‌లో నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదట. ఇప్పుడు తెలుగు సినిమాల్లోనే నటిస్తూ ఉండిపోవాలని ఉందని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
ముంబయిలో పుట్టిపెరిగిన ఈ భామకు ట్రిప్పులంటే చాలా ఇష్టమట.. అవకాశం దొరికినప్పుడల్లా కొత్త ప్రదేశాలకు ట్రిప్ ప్లాన్ చేస్తుంటుంది.
This browser does not support the video element.
షూటింగులో బిజీగా ఉన్నా ఈ భామ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటోంది. తరచూ.. తన గ్లామర్ ఫొటోలు పోస్టు చేస్తూ యువతను కట్టిపడేస్తుంది.