ఘూమర్‌ ఘూమర్‌.. సయామీ ఖేర్‌!

సాయిధరమ్‌ తేజ్‌ తొలి చిత్రం ‘రేయ్‌’ లో హీరోయిన్‌గా నటించిన సయామీ ఖేర్‌ తాజాగా ‘ఘూమర్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఆర్‌. బాల్కీ తెరకెక్కించిన ఈ చిత్రంలో సయామీ కుడి చేతిని కోల్పోయిన ఓ క్రికెటర్‌ పాత్ర పోషించగా.. అభిషేక్‌ బచ్చన్‌ కోచ్‌గా కనిపించారు.

ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైనప్పుడే సాయిధరమ్‌ తేజ్‌.. సయామీకి, చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ ట్వీట్‌ చేశాడు. 

ఇక సినిమాలో సయామీ నటనకు ప్రేక్షకుల నుంచే కాదు.. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలందుతున్నాయి. తను పాత్రకు నూరు శాతం న్యాయం చేసిందని మెచ్చుకుంటున్నారు.

సయామీ వ్యక్తిగత విషయాలకొస్తే.. మహారాష్ట్రలోని నాశిక్‌లో జన్మించింది. ఈమె మాజీ మిస్‌ ఇండియా ఉత్తర మైత్రే ఖేర్‌ కుమార్తె. ప్రముఖ నటి ఉషా కిరణ్‌ మనవరాలు. 

ముంబయిలో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత ఈమె ‘మిర్జ్యా’తో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. 2018లో ‘మావులీ’ అనే మరాఠీ చిత్రంలో నటించింది. 

బాలీవుడ్‌లో 2020లో వచ్చిన ‘చాక్డ్‌’లో సయామీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ‘అన్‌పాజ్డ్‌’లోనూ మెరిసింది. 

నాగార్జున ‘వైల్డ్‌డాగ్‌’తో మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. ఆ తర్వాత ఆనంద్‌ దేవరకొండ ‘హైవే’లోనూ నటించింది. 

ఈ ఏడాదే ‘8ఏ.ఎం మెట్రో’తో మెప్పించిన సయామీ.. ఇప్పుడు ‘ఘూమర్‌’తో మరోసారి ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. 

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home