పవర్‌ఫుల్‌ సామ్‌ను చూశారా..!

టాలీవుడ్‌లో ఫిట్‌నెస్‌పై ఎక్కువ ఫోకస్‌ పెట్టే అతికొద్ది మంది హీరోయిన్లలో సమంత ఒకరు. కెలోరీలను కరిగించడానికి జిమ్‌లో నిత్యం చెమటోడుస్తారు. తాజాగా ఇన్‌స్టాలో ఆమె షేర్‌ చేసిన ఆబ్‌ రోలర్‌, చిన్‌ - అప్స్‌ వర్కౌట్‌ వీడియోలు వైరల్‌గా మారాయి.

This browser does not support the video element.

పొట్ట కండరాలను దృఢ పరిచేందుకు కఠినమైన ఆబ్‌ రోలర్‌ వర్కౌట్‌ చేస్తారు. ఈ వర్కౌట్‌ వెన్నెముక, భుజాలు, ఛాతి, చేతులు,

ఉదర భాగంలోని కండరాలను బలోపేతం చేస్తుంది. ఆబ్‌ వీల్‌ ప్లాంక్‌, వీ రోలౌట్స్‌,

వన్‌ లెగ్‌ రోలౌట్‌ వంటివి ఆబ్‌ రోలర్‌తో చేయొచ్చు.

ఈ వర్కౌట్‌ కాలి బొటనవేలి నుంచి తల వరకూ ప్రభావం చూపుతుంది. ఇలా 30 నిమిషాలు చేస్తే.. దాదాపు 2 గంటల స్ట్రెంగ్త్‌ ట్రైయినింగ్‌ చేసినంత ప్రభావం చూపుతుంది.

శరీరంలోని జాయింట్లు, లిగ్మెంట్లను ఆబ్‌ రోలర్‌ వర్కౌట్‌ బలోపేతం చేస్తుంది. ఉదర భాగానికి చేసే వ్యాయామాల కంటే ఇది ప్రభావవంతమైంది.

ఈ వర్కౌట్‌ను రోజూ చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మెదడుకు ఆక్సిజన్‌ సరఫరా బాగా జరుగుతుంది. మానసికంగా చురుగ్గా ఉండటానికి ఉపకరిస్తుంది.

పెద్దగా పరికరాలు అవసరం లేకుండా ప్రభావవంతంగా వ్యాయామం చేయడానికి ఆబ్‌ రోలర్‌ ఉపయోగపడుతుంది. చౌకగా లభించే ఒక్క ఆబ్‌ రోలర్‌ను బ్యాగ్‌లో ఎక్కడికైనా తేలిగ్గా తీసుకెళ్లవచ్చు.

This browser does not support the video element.

చిన్‌-అప్స్‌.. మోచేతులు, ఉదర భాగం బలంతో శరీరం మొత్తం బరువును పైకి లేపుతూ ఈ వ్యాయామం చేస్తారు. ఇలా చేయడం వల్ల బైసప్స్‌, వీపు, ఉదర భాగం, భుజాలపై ప్రధానంగా ఒత్తిడి పడుతుంది.

ప్రారంభంలో కొంచెం కష్టంగా ఉన్నా.. అలవాటయ్యాక తేలిగ్గా చేయవచ్చు. పోను పోను ఒత్తిడి పెంచడం కోసం బరువులను శరీరానికి కట్టుకొని చిన్‌ - అప్స్‌ చేస్తుంటారు.

అగ్ర హీరోలతో దుషారా

ధనుష్‌.. ఓ ఇన్‌స్పిరేషన్‌

శ్రుతి హాసన్ @ 15.. ఈ విషయాలు తెలుసా?

Eenadu.net Home