పేరు చివరన ‘మేనన్‌’ తీసేసింది! ఎందుకంటే..?

టాలీవుడ్‌లో ‘మాస్టారు మాస్టారూ..’ అంటూ ‘సార్‌’ సినిమాతో తెలుగు వారికి దగ్గరైంది సంయుక్త మేనన్‌. ప్రస్తుతం ‘డెవిల్‌’లో కళ్యాణ్‌ రామ్‌ సరసన నటిస్తోంది. ఈ చిత్రం నవంబరులో విడుదల కానుంది.

సెప్టెంబరు 11న సంయుక్త పుట్టినరోజు ఆ సందర్భంగా చిత్ర బృందం ఆమె పోస్టర్‌ని విడుదల చేసింది. ‘డెవిల్‌’ 1940 కాలంనాటి గూఢచర్యం నేపథ్యంలో తెరకెక్కుతుంది.

‘బింబిసార(2022)’లో కళ్యాణ్‌ రామ్‌కి జంటగా సంయుక్త నటించింది. ఈ సినిమా షూటింగ్‌ జరుగుతుండగానే ‘సార్‌’లో అవకాశం లభించింది.

‘బీమ్లా నాయక్‌’లో ఓ కీలక పాత్రతో ముందే తెలుగు తెరకు పరిచయమైనా ‘సార్‌’తోనే పాపులరైంది. ఆ తర్వాత వచ్చిన ‘విరూపాక్ష’తో మరోసారి హిట్‌ కొట్టి హీరోలకు లక్కీ ఛాన్స్‌గా మారిపోయింది. 

This browser does not support the video element.

‘మాస్టారు మాస్టారూ..’ పాట ఎంత హిట్‌ అంటే, ఈ పాట మీద లక్షమందికి పైగా రీల్స్‌ చేశారు. అంతలా వైరల్‌ అయ్యింది.

ఫొటో ఫ్రేమ్‌లో నన్ను చూసుకొని యాక్టింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నాను. అప్పటి నుంచే మోడలింగ్‌ చేయడం మొదలుపెట్టానని చెబుతుంది.

ఇటీవల సోషల్‌మీడియాలో తన పేరు చివరన ఉన్న మేనన్‌ తీసేసింది. ‘కులం, మతం పేరు చెప్పుకొని ఎదగడం నాకు ఇష్టం లేదు. స్వశక్తితో ఎదగాలనుంది’. అంటూ కారణం తెలిపింది. 

సంయుక్త... నా పేరుకన్నా కూడా సినిమాలో చేసిన పాత్రల పేర్లతో పిలిస్తేనే ఇష్టం. నేను చేసిన ప్రతి పాత్ర నాకు బాగా నచ్చుతుంది అంటుంది.

‘‘నేర్చుకోవడం అనేది ఓ కళ. ఒక్క చదువే కాదు. మన చుట్టూ ఎన్నో అంశాలున్నాయి. మనకి ఆసక్తి ఉండాలే కానీ నిత్య విద్యార్థిలా ఉండొచ్చు. అదే పట్టుదలతో నేను తెలుగు నేర్చకున్నాను’’.

ఈ వారం.. సందడి వీరిదే..

చదివింది ‘లా’.. నటనతో ఆకట్టుకునేలా!

పుట్టింది కేరళ.. చదివింది హైదరాబాద్‌..!

Eenadu.net Home