‘కాంతార’ సప్తమి గురించి తెలుసా..!

సప్తమి గౌడ ఈ పేరు వినే ఉంటారుగా.. ‘కాంతార’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఇప్పుడు తెలుగు హీరో నితిన్‌తో ‘తమ్ముడు’ మూవీతో ఇక్కడి ప్రేక్షకులను అలరించనుంది.

(photos:instagram)

దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘తమ్ముడు’కి వేణు శ్రీరామ్‌ దర్శకుడు.

 సప్తమి బెంగళూరు(1996)లో పుట్టింది. చదువంతా కర్ణాటకలో సాగింది. బెంగళూరు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో సివిల్‌ ఇంజినీరింగ్‌ చేసింది.

నటనపై ఉన్న ఆసక్తితో మోడలింగ్‌లో అడుగుపెట్టింది. కన్నడలో ‘పాప్‌కార్న్‌ మంకీ టైగర్‌(2019)’తో తెరంగేట్రం చేసింది. ఈ చిత్రంలో తన నటనకుగానూ సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డు లభించింది.

సప్తమి ‘కాంతార’తో 2022లో గొప్ప విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ‘ద వ్యాక్సిన్‌ వార్‌’, ‘యువ’, ‘కాళి’, ‘కాంతార 2’ తదితర చిత్రాల షూటింగ్‌లో బిజీగా ఉంది.

నవలలు చదవడం, స్విమ్మింగ్‌ చేయడం సప్తమికి బాగా నచ్చుతుందట. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా విహారయాత్రలకు వెళ్తుంది. 

సప్తమి స్కూల్లో చదువుకునేటప్పుడు పలుమార్లు స్విమ్మింగ్‌ పోటీల్లో ట్రోఫీలు గెలుచుకుంది. అంతే కాకుండా 2010లో స్టేట్‌, నేషనల్‌ లెవెల్‌లో స్విమ్మింగ్‌ పోటీల్లో పాల్గొంది.

 రాధిక పండిట్‌, నిత్యా మేనన్‌, సమంతలకు సప్తమి వీరాభిమాని. ఎవరైనా న్యూట్రిషన్‌ గురించి సలహాలు ఇస్తే చాలా ఆసక్తిగా వాటిని పాటిస్తుంది. అలాగే శరీరాన్ని దృఢంగా ఉంచుకునేందుకు ఎక్కువ సమయం వర్కవుట్‌లు చేస్తుంది.

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home