అమ్మ చెప్పిన మాట మర్చిపోలేను!

బాలీవుడ్‌లో సల్మాన్‌ ఖాన్‌ ‘దబాంగ్‌ 3’తో పరిశ్రమలోకి అడుగుపెట్టిన సయీ మంజ్రేకర్‌. ఇప్పుడు రామ్‌ పోతినేని ‘స్కంద’లో కీలకపాత్ర పోషించింది.

ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌. దర్శకుడు బోయపాటి. ఈ చిత్రంలో రామ్‌ చెల్లెలిగా ‘పరిణీత’ రోల్‌లో మెరిసింది. ఇందులో కథానాయిక శ్రీలీల. 

బాలీవుడ్‌లో తను నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 

మరాఠీ చిత్రంతో 2012లోనే బాలనటిగా మెరిసింది. వరుణ్‌ తేజ్‌సరసన ‘గని’లోనూ, అడవిశేషుతో ‘మేజర్‌’లోనూ తన నటనతో ఆకట్టుకుంది. 

ముంబయిలో పుట్టిన ఈ బ్యూటీ చదువంతా స్థానికంగానే సాగింది. నాన్న మహేష్‌ మంజ్రేకర్‌ యాక్టర్‌, డైరెక్టర్‌. అమ్మ మేధా ప్రొడ్యూసర్. 

నటన మీదున్న ఇష్టంతో.. చిన్నప్పట్నుంచే డ్యాన్స్‌, యాక్టింగ్‌ దిశగా అడుగులేసింది. మొదటి రోజు షూటింగ్‌కి వచ్చిన అమ్మ ‘ఎవ్వరినీ అనుకరించకు. నువ్వు నీలా ఉండు. సహజంగా నటించు’ అని చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేను అంటోంది.

సయీ నటించాల్సిన సినిమాల్లో, కథలు, పాత్రలు ఏవైనా తనకు నచ్చినా.. నచ్చకపోయినా.. తల్లిదండ్రులకు నచ్చితే చాలు ఓకే చేస్తానంటోంది. 

హైదరాబాద్‌ వస్తే టమాటా పప్పు, అన్నం, గోంగూర పచ్చడి తినాల్సిందే. ‘రామ్‌ నేను సెట్‌లో ఖాళీగా ఉన్న సమయంలో ఎక్కువగా ట్రావెలింగ్‌, ఫుడ్‌ గురించే మాట్లాడుకునే వాళ్లం’ అని చెబుతోంది. 

ఖాళీ సమయం దొరికితే విహారయాత్రలకు ప్లాన్‌ చేస్తుంది. న్యూ జెర్సీ అంటే ఇష్టం. వివిధ ప్రాంతాల్లో దొరికే రకరకాల ఆహార పదార్థాలను రుచి చూస్తుంది.  

హార్స్‌ రైడింగ్‌ తన హాబీ. పెంపుడు జంతువులంటే చాలా అభిమానం. తన ఇన్‌స్టాలో వాటి ఫొటోలే ఎక్కువగా ఉంటాయి.

వింటర్‌ ట్రెండ్స్‌ చూశారా..?

ఏ ట్రైలర్‌ని ఎంత మంది చూశారో..?

తెలుగు హీరో.. మలయాళీ విలన్‌!

Eenadu.net Home