శివాని.. అందాల సునామీ!

టాలీవుడ్‌ నటులు జీవిత-రాజశేఖర్‌ పెద్దకుమార్తె శివాని రాజశేఖర్‌ కూడా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా కొనసాగుతోంది. 

(Photos: Instagram/Shivani Rajashekar)

తాజాగా ఈమె నటించిన ‘జిలేబి’ ఆగస్టు 18న విడుదల అయ్యింది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కె. విజయభాస్కర్‌ తన కుమారుడు శ్రీ కమల్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించారు.

శివాని జులై 1, 1994న చెన్నైలో జన్మించి.. హైదరాబాద్‌లో పెరిగింది. తండ్రి లాగే ఈమె కూడా డాక్టర్‌. ఎంబీబీఎస్‌ పూర్తి చేసి సినిమాల్లోకి అడుగుపెట్టింది. 

యువ నటుడు తేజ సజ్జ నటించిన ‘అద్భుతం’తో శివాని వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ‘డబ్ల్యూడబ్బ్యూడబ్ల్యూ’లో నటించింది. తండ్రితో కలిసి ‘శేఖర్‌’లో తెరను పంచుకుంది. 

తెలుగులోనే కాదు.. తమిళ్‌లోనూ రాణిస్తోంది. కోలీవుడ్‌లో విడుదలైన ‘అన్బరివు’, ‘నెంజికు నీతి’ చిత్రాల్లో మెరిసింది. 

ఇటీవల రాజ్‌తరుణ్‌తో కలిసి ‘ఆహా నా పెళ్లంట’ వెబ్‌సిరీస్‌ చేసింది. ఈమె నటనకు మంచి గుర్తింపు లభిస్తున్నా.. సక్సెస్‌ మాత్రం దక్కట్లేదు. 

హీరోయిన్‌ కాకముందే శివాని.. నిర్మాత అవతారం ఎత్తింది. ‘ఎవడైతే నాకేంటి’, ‘సత్యమేవ జయతే’, ‘కల్కి’ చిత్రాలను ఈ భామే నిర్మించింది. 

కాలేజీ రోజుల్లోనే చదువుతోపాటు మోడలింగ్‌ చేసేది. ఆ నేపథ్యం ఉండటంతో ‘ఫెమినా మిస్‌ ఇండియా 2022’కు తమిళనాడు తరఫున ప్రాతినిథ్యం వహించేందుకు సిద్ధమైంది. కానీ, చివరి నిమిషంలో తప్పుకుంది. 

ప్రస్తుతం ఈ తెలుగు బ్యూటీ ‘విద్యా వాసుల అహం’తోపాటు ‘కోట బొమ్మాళి పి. ఎస్‌’లో నటిస్తూ బిజీగా ఉంది. 

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home