ఇది సిక్కిం చార్‌ధామ్‌!

ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ ఒకే చోట కనిపిస్తే... పూరీ జగన్నాథుడితోపాటూ బద్రీనాథుడినీ ఒకేసారి దర్శించుకోగలిగితే... అంతకన్నా భాగ్యం ఏముంటుంది? 

ద్వారకాధీశుడితోపాటూ ఆకాశాన్నంటుతున్నట్లుగా కనిపించే పరమేశ్వరుడి విగ్రహాన్ని కూడా చూడాలంటే చార్‌ధామ్‌గా పిలిచే సిద్ధేశ్వర్‌ ధామ్‌కు వెళ్లాల్సిందే.

సిక్కింలోని నామ్‌చీలో సోలోపోక్‌ కొండపైన కనిపించే ఈ ఆధ్యాత్మిక ధామాన్ని అక్కడి ప్రభుత్వం సుమారు పన్నెండు సంవత్సరాల క్రితం నిర్మించింది. 

విశాలమైన ప్రాంగణంలో అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడే ఈ సన్నిధానంలో 108 అడుగుల ఎత్తులో కనిపించే పరమశివుడి విగ్రహం ఇక్కడి ప్రత్యేకత

పరమేశ్వరుడికి ఎదురుగా నంది కొలువుదీరి ఉంటుంది.

స్వామి చుట్టూ ద్వాదశ జ్యోతిర్లింగాల ఆలయాలు ఉండటం ఈ చార్‌ధామ్‌కి ఉన్న మరో ప్రత్యేకత. 

అలాగే, మెట్లకు ఇరువైపులా... రామేశ్వరం, బద్రీనాథ్‌, పూరీ జగన్నాథ్‌, ద్వారక ఆలయాల తాలూకు నమూనాలనూ దర్శించుకోవచ్చు.

ఆకట్టుకునే నిర్మాణశైలితో భక్తులను ఆనంద పరవశులను చేసే ఈ సిద్ధేశ్వర్‌ధామ్‌లో కోరుకున్నంతసేపు హాయిగా గడిపేయొచ్చు, ఫొటోలూ దిగొచ్చు

ఈ ఆలయానికి చేరుకోవడానికి దేశం నలుమూలల నుంచి రైల్వే సదుపాయాలు ఉన్నాయి. ఇక నామ్‌చీ రోడ్డు ద్వారా కూడా చేరుకోవచ్చు.

మే 23.. బుద్ధపౌర్ణిమ

మే 21 వరల్డ్‌ మెడిటేషన్‌ డే

వృత్తి జీవనానికి చాణక్య నీతులు

Eenadu.net Home