నాజూకు నయగారం..
శిల్పాశెట్టి.. సోషల్ మీడియాలో మరోసారి వైరలయ్యింది. ఆమె సినీ ప్రస్థానం మొదలై నవంబరుకు 30ఏళ్లు కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
‘‘టాప్ 10 హీరోయిన్లలో ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడొక మంచి స్థానంలో ఉన్నాను. నా శ్రమకు తగిన ఫలితం దక్కినందుకు సంతోషంగా ఉంది. జీవితం నాకు ఎలాంటి పరిస్థితుల్లో ఎలా నడుచుకోవాలనే విషయం నేర్పింది.’’ - శిల్పాశెట్టి
తెరంగేట్రం చేసి 30 ఏళ్లు కానున్నందుకు శిల్పకు అభినందనలు తెలుపుతూ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇన్నేళ్లయినా అంతే ఉత్సాహంగా, అంతే అందంగా ఎలా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు.
బాలీవుడ్‌లో 1993లో ‘బాజీఘర్’తో తెరంగేట్రం చేసింది. ప్రస్తుతం హిందీలో ‘సుఖి’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. సోనాల్ జోషి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబరు 22న విడుదల కానుంది.
కన్నడలో ‘కేడీ: ది డెవిల్’లో నటిస్తోంది. ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ అనే వెబ్‌సిరీస్‌తో ఓటీటీలో అడుగుపెట్టనుంది. ఇవే కాకుండా వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంది.
శిల్పాశెట్టి కర్ణాటక(1975)లో పుట్టింది. 16 ఏళ్ల వయసులో మోడలింగ్‌లో అడుగుపెట్టింది. భరతనాట్యం మీదున్న ఇష్టంతో పట్టుబట్టి మరీ నేర్చుకుంది. స్పోర్ట్స్‌లో యాక్టివ్‌గా పాల్గొనేది. స్కూల్ వాలీబాల్ టీమ్‌కి కెప్టెన్ కూడా.
బేస్‌బాల్, కరాటేలో చురుకుగా పాల్గొనేది. ఇంగ్లీషు, మరాఠీ, తుళు, తెలుగు, గుజరాతి, తమిళం, ఫ్రెంచ్ భాషల్లో అనర్గళంగా మాట్లాడుతుందట.
This browser does not support the video element.
శిల్పా శెట్టి 2009లో రాజ్ కుంద్ర అనే బిజినెస్‌మేన్‌ని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు.
ప్రస్తుతం టీవీలో ‘ఇండియాస్ గాట్ టాలెంట్ 10’కి జడ్జిగా వ్యవహరిస్తోంది. షూటింగ్‌లో ఎంత బిజీగా ఉన్నా శిల్ప సోషల్‌మీడియాలో రెగ్యులర్‌గా పోస్టులు పెడుతూ ఉంటుంది.
This browser does not support the video element.
పిల్లలతో చేసిన అల్లరి, డ్యాన్స్ వీడియోలు ఎక్కువగా తన ఇన్‌స్టాలో పంచుకుంటుంది.
శిల్పాశెట్టి 48 ఏళ్ల వయసులోనూ ఇంత నాజూగ్గా, యాక్టివ్‌గా ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా..! రోజూ తీసుకునే ఆహారంలో 70శాతం తాజా కూరగాయలు, పండ్లే ఉంటాయి.
This browser does not support the video element.
ఎన్నో ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరించిన శిల్ప... జిమ్ ట్రైనర్‌గానూ వ్యవహరించింది. ఇప్పటికీ రోజూ 45 నిమిషాల పాటు అష్టాంగ యోగా చేస్తుంది.
(source:instagram)