ప్రేమతో మీ సిమ్రత్ కౌర్..
సిమ్రత్‌కౌర్ గురించి విన్నారా? అదేనండీ.. నాగార్జున, నాగ చైతన్య నటించిన ‘బంగార్రాజు’చిత్రంలో నాగచైతన్యను ఇష్టపడే పల్లెటూరు అమ్మాయిగా మెరిసి అందరి దృష్టిని ఆకర్షించింది.
తాజాగా ఈ బ్యూటీ హిందీలో ‘గదర్ 2’లో నటించి హిట్ కొట్టింది. ఈ సినిమా 2001లో వచ్చిన ‘గదర్: ఏక్ ప్రేమ్ కథా’కి సీక్వెల్‌గా తెరకెక్కించారు.
This browser does not support the video element.
సన్నీ డిఓల్, అమీషా పటేల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో సిమ్రత్ కీలక పాత్ర పోషించింది. 1971లో భారత్‌కి పాకిస్థాన్‌కి మధ్య జరిగిన సంఘర్షణ నేపథ్యంలో తీసిన చిత్రమిది.
సిమ్రత్.. ముంబయిలో స్థిరపడ్డ పంజాబీ కుటుంబంలో 1997లో జన్మించింది. బీఎస్సీ పూర్తి చేసింది. కాలేజీ రోజుల్లోనే క్యాడ్‌బెరీ యాడ్‌లో నటించింది.
సినిమాలపై ఆసక్తితో టాలీవుడ్‌కి వచ్చి 2017లో విడుదలైన ‘ప్రేమతో మీ కార్తీక్’తో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ‘పరిచయం’అనే మరో చిత్రంలోనూ నటించింది. రెండు చిత్రాలూ నిరాశపర్చాయి.
‘డర్టీ హరి’ చిత్రంతో కాస్త పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాతే ‘బంగార్రాజు’లో చిన్న పాత్ర పోషించి ఆకట్టుకుంది.
బాలీవుడ్‌లో ‘సోనీ’తో అడుగుపెట్టి.. నాలుగేళ్ల తర్వాత ‘గదర్ 2’లో నటించి సక్సెస్ అందుకుంది. పలు హిందీ, పంజాబీ మ్యూజిక్ వీడియోల్లోనూ ఆడిపాడింది.
సిమ్రత్ చేసిన ‘బర్జ్ కలీఫా’, ‘లారా లప్పా’ పంజాబీ మ్యూజిక్ వీడియోలు, మికా సింగ్ రూపొందించిన ‘తేరే బిన్ జిందగీ’ వీడియో సాంగ్స్ బాగా వైరలయ్యాయి.
This browser does not support the video element.
ఖాళీ సమయం దొరికితే సిమ్రత్ ఎక్కువగా ట్రావెల్ చేసేందుకే ఇష్టపడుతుందట. డ్యాన్స్ చేయడం, పెయింటింగ్ వేయడం, హార్స్ రైడింగ్ ఈమె హాబీలు.
టాలీవుడ్‌లో నాగార్జున, మహేశ్‌బాబు, అల్లు అర్జున్ ఈ బ్యూటీకి నచ్చిన హీరోలు. ఆహారం విషయానికొస్తే ఈమెకి రాజ్మా చవ్లాతో పాటు షాహీ పూరి అంటే చాలా ఇష్టమట.