తెలుగు రుచుల్ని మర్చిపోలేను!
తమిళ, కన్నడ సినిమాల్లో ఎక్కువగా నటించే శ్రద్ధా శ్రీనాథ్.. టాలీవుడ్‌లో నాని సరసన ‘జెర్సీ’తో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం వెంకటేష్‌తో ‘సైంధవ్’లో నటిస్తోంది.
యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకుడు. ఇది పాన్ ఇండియా మూవీ. ఇందులో ‘మనోజ్ఞ’ పాత్రలో మెరవనుంది. ‘సైంధవ్’ డిసెంబరులో విడుదల కానుంది.
‘రుద్ర ప్రయాగ్’, ‘కలియుగం’, ‘లెటర్స్ టూ మిస్టర్ ఖన్నా’ అనే కన్నడ, తమిళ సినిమాల్లోనూ శ్రద్దానే హీరోయిన్.
ఉధంపూర్(జమ్మూ, కశ్మీర్)లో పుట్టిన శ్రద్ధ బెంగళూరులో చదువుకుంది. బెంగళూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లీగల్ స్టడీస్‌లో ఎల్ ఎల్ బీ చదివింది.
నాన్న ఆర్మీ ఆఫీసర్, అమ్మ టీచర్. చదువు పూర్తయ్యాక కొద్ది రోజులు రియల్ ఎస్టేట్‌రంగంలో లీగల్ అడ్వైజర్‌గా పనిచేసింది.
ఓ ప్రకటనలో నటించిన తర్వాత.. ఆడిషన్స్‌కి వెళ్తే కన్నడ మూవీ కోసం ఓకే చేశారు. అప్పుడే లా నుంచి నటనవైపు అడుగులేసింది.
మలయాళం(2015)లో ‘కోహినూర్’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. కన్నడ ‘యూటర్న్’లో శ్రద్ధ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఫిల్మ్‌ఫేర్ అవార్డూ లభించింది.
This browser does not support the video element.
‘సైంధవ్’ షూటింగ్ విశాఖపట్నంలో జరుగుతున్నప్పుడు ఒక హోటల్‌లో మీల్స్ ఆర్డర్ చేసింది. భోజనానికి ముందు వీడియో తీసుకుంది. దాన్ని ‘ఈ ఆంధ్రా భోజనం అంటే నాకు చాలా ఇష్టం’ అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో పంచుకుంది.
ఎక్కడికి వెళ్లినా తెలుగు సంప్రదాయాల్ని, రుచుల్ని మర్చిపోలేనని చెబుతుంది.
ఈ బ్యూటీకి హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్, మమ్ముట్టిల నటన ఇష్టం. విహారయాత్ర అంటే లండన్ నగరమే గుర్తొస్తుంది అంటుంది.