స్కూల్లో పేరు మార్చుకుంది!

‘వాల్తేరు వీరయ్య’లో ‘నీకేమో అందమెక్కువ...’ అంటూ చిరంజీవి పక్కన స్టెప్పులేసింది శ్రుతి హాసన్. ప్రభాస్‌ ‘సలార్‌’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌. ప్రశాంత్‌నీల్‌ దర్శకుడు. ‘సలార్‌’ టీజర్‌ ఇప్పటికే సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంట్లో శ్రుతి హాసన్‌ ఆద్య పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 22న విడుదల కానుంది.

‘సుగుణా సుందరి.. సుగుణా సుందరి..’ అంటూ ‘వీర సింహారెడ్డి’లో బాలకృష్ణ సరసన మెరసింది. 

This browser does not support the video element.

ఇటీవల శ్రుతి పియానో ప్లే చేస్తూ ఓ పాట పాడింది. దాన్ని ఇన్‌స్టాలో షేర్‌ చేస్తే.. ‘శ్రుతి నువ్వు మల్టీ టాలెంటెడ్‌. మంచి యాక్టర్‌, సింగర్‌, పియానో కూడా వాయిస్తున్నావు’ అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

కమల్‌ హాసన్‌, శ్రుతి కలసి ఓ మ్యూజిక్‌ ప్రాజెక్టులో నటించనున్నారు. ‘నాన్నతో కలసి పని చేస్తున్నది నిజమే.. అందుకు గర్వంగా ఉంది. ఈ మ్యూజిక్‌ వీడియో ఏంటో త్వరలోనే చెబుతాం’ అంటుంది శ్రుతి.

ఓ కాలేజీలో ‘అండర్‌ 25 సమ్మిట్‌’లో శ్రుతి పాల్గొని విద్యార్థులతో సరదాగా ముచ్చటించింది. అమ్మాయిలను ఉద్దేశించి.. ‘ప్రతి ఒక్కరిలో సూపర్ పవర్ ఉందని నమ్ముతా. మీరూ నమ్మండి. అప్పుడే జీవితంలో పైకి ఎదుగుతాం’ అంటూ సలహా ఇచ్చింది. 

ఈ బ్యూటీకి నలుపు రంగంటే ఎంతో ఇష్టం. సోషల్ మీడియాలో ఎక్కువగా బ్లాక్‌ డ్రెస్సుల్లో ఫొటోలునే పంచుకుంటుంది. 

సెలబ్రిటీ కూతురిగా గొప్పలు చెప్పుకోవడం తనకి ఇష్టం ఉండదు.. అందుకే స్కూల్లో ‘పూజా రామచంద్రన్‌’ అనే పేరు రిజిస్టర్‌ చేయించుకుంది.

ఆరేళ్లు ఉన్నప్పుడే గొంతు సవరించుకుంది. సినిమాల్లో పాడటంతో పాటూ సొంతంగా డబ్బింగ్‌ కూడా చెప్పుకుంటోంది. 

This browser does not support the video element.

‘ఖాళీ సమయం దొరికితే షాపింగ్‌ చేస్తాను. ఎక్కువగా షూస్‌ కొంటాను. మ్యూజిక్‌ బ్యాండ్‌తో ఎంజాయ్‌ చేస్తాను’అంటోంది.

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home