అన్నీ అమ్మనే అడుగుతాను..
షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ తెలుసా..! ‘ది ఆర్చీస్’తో పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ మూవీ డిసెంబరు 7న నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదల కానుంది.
This browser does not support the video element.
జోయా ఆక్తర్ దర్శకత్వంలో అగస్త్యనంద హీరోగా వస్తోన్న ఈ చిత్రానికి ఆమెరికన్ కామిక్ బుక్ సిరీస్ ‘ది ఆర్చీస్’ టైటిల్‌నే పెట్టారు.
మరో వైపు షారుఖ్, సుహానా త్వరలోనే తెరను పంచుకోనున్నారు. ఈ కాంబోలో సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ నవంబరులో పట్టాలెక్కనుంది.
ఇంగ్లాండ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. న్యూయార్క్‌లోని యాక్టింగ్, డ్రామా స్కూల్లో నటనలో శిక్షణ తీసుకుంది. స్కూలు, కాలేజీలో ఉన్నప్పుడు వివిధ రకాల కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉత్సాహంగా ఉండేది.
తన దుస్తులు, ఇతర యాక్సెసరీల ఖరీదు లక్షల్లో పైమాటే.. ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న ట్రెండీ దుస్తుల్లో కనిపించే ఈ బ్యూటీ నెట్టింట ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది.
This browser does not support the video element.
‘ది గ్రే పార్ట్ ఆఫ్ బ్లూ’ అనే పది నిమిషాల షార్ట్ ఫిలిం(2019)లో నటించింది. టీనేజర్స్ జర్నీ ఎలా ఉంటుందనే థీమ్‌తో వచ్చిన ఈ లఘుచిత్రం విద్యార్థులను ఆకట్టుకుంది.
‘అమ్మానాన్నల గైడెన్స్‌లోనే ప్రతి అడుగూ వేస్తాను. నా హెయిర్ స్టైల్ దగ్గర్నుంచీ, డ్రెస్సింగ్ స్టైల్ వరకూ అన్నీ అమ్మనే అడుగుతాను. తను ఓకే అంటే నాకూ ఓకే’ అని చెబుతుంది సుహానా..
‘ప్రొడ్యూసర్‌గానూ, ఇంటీరియర్ డిజైనర్ గానూ వ్యవహరిస్తోన్న అమ్మే నాకు స్ఫూర్తి. తనలాగే ధైర్యంగా జీవితంలో స్థిరపడాలనుంది. కానీ.. ఇప్పటికీ ప్రతి దానికీ తన మీద ఆధారపడుతున్నాను’- సుహానా
సుహానాకి ఫుట్‌బాల్ ఆడడమంటే ఎంతో ఇష్టం. స్కూల్లో అండర్ 14 అమ్మాయిల టీమ్‌కి కెప్టెన్‌గానూ వ్యవహరించింది.
స్పోర్ట్స్ చూడటం అంటే సుహానాకి బాగా ఇష్టం. తండ్రితో పాటు పలు క్రికెట్ మ్యాచ్‌లను చూస్తుంది. ఖాళీ సమయం దొరికితే కథలు రాయడానికి ఇష్టపడుతుంది.
సోషల్ మీడియా సెలబ్రిటీగా ఫేమస్ అయిన సుహానాకి ఇన్‌స్టాలో 4.3 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
ఐపీఎల్ సమయంలో కెకెఆర్ మ్యాచ్‌ను చూసేందుకు షారుక్ ఖాన్, సుహానా, గౌరి ఖాన్ వెళ్లారు. ఆ మ్యాచ్‌కే వారు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు