ఏడు రకాలుగా పెళ్లి చేసుకోవాలనుంది..
‘వేర్ ఈజ్ ద పార్టీ బాసు.. వేర్ ఈజ్ ద పార్టీ..’ అంటూ వాల్తేర్ వీరయ్యలో చిరంజీవి పక్కన స్టెప్పులేసిన ఊర్వశి రౌతేలా గుర్తుందా..! ప్రస్తుతం ‘హమ్ తో దివానే’ మ్యూజిక్ వీడియోతో ఊర్వశి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
This browser does not support the video element.
ఈ వీడియోలో ‘బిగ్‌బాస్ ఓటీటీ 2’ విన్నర్ ఎల్వీష్ యాదవ్‌కు జంటగా నటించింది. ఇది విడుదలైన వారంరోజుల్లోనే 28 మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది.
ప్రత్యేక పాటలకు రూ. కోటి నుంచి మూడుకోట్ల వరకూ పారితోషికం తీసుకుంటున్నట్లు ఆమె గురించి సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. దానికి ఆమె.. ‘స్వయం కృషితో యాక్టింగ్‌లోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ ఈ రోజును చూడాలనుకుంటారు..’ అని బదులిచ్చింది.
ఊర్వశి నగలు, దుస్తులపై వార్తలు ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటాయి. ఇటీవల భారీగా ఆభరణాలు, లెహంగా ధరించి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
పెళ్లిపై తన అభిప్రాయాన్ని అడిగితే.. తనకు ఏడు రకాలుగా పెళ్లి చేసుకోవాలనుందని చెబుతోంది. క్రిస్టియన్, హిందూ, బెంగాలీ, డెస్టినేషన్, క్రూయిజ్, థీమ్ బేస్డ్, బీచ్ వెడ్డింగ్ ఇలా.. రకరకాల పద్దతులను అనుసరించాలనుందని తెలిపింది.
ఈ బ్యూటీ ఇన్‌స్టాలో యాక్టివ్. తన ఖాతా ఫాలోవర్స్ 6.80 కోట్ల మంది.
ఊర్వశి మంచి బాస్కెట్ బాల్ ప్లేయర్. నేషనల్ లెవల్‌లోనూ ఆడింది.
‘ఊర్వశి రౌతేలా ఫౌండేషన్’ పేరిట స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి.. పేదవారికి విద్య, ఆరోగ్యం, కనీస అవసరాలను సమకూర్చుతోంది.
తను యాక్టర్ కాకపోయి ఉంటే.. ఎరోనాటికల్ ఇంజినీర్, ఐఏఎస్ అయ్యుండేదాన్నని అంటుంది.
This browser does not support the video element.
ప్రస్తుతం ఈమె బాలీవుడ్‌లో ‘దిల్ హై గ్రే’లో నటిస్తోంది. ‘స్కంద’లో రామ్ సరసన ‘కల్ట్ మామ.. కల్ట్ మామ..’ అంటూ ఓ ప్రత్యేక పాటలో మెరిసింది.