మళ్లీ రంగంలోకి లాయరమ్మ..
‘ఫెయిర్ అండ్ లవ్లీ’ బ్యూటీ యామీ గౌతమ్.. సినిమాల జోరు చూపిస్తోంది. ఈ ఏడాదిలో మూడోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది.
(photos:instagram/yamigautam)
ఇప్పటికే ‘లాస్ట్’, ‘చోర్ నికల్ కె భాగా’తో ఆకట్టుకున్న యామీ.. తాజాగా విడుదలైన ‘ఓ మై గాడ్ 2’లోనూ మెరిసింది.
‘ఓ మై గాడ్’ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడంతో దానికి సీక్వెల్‌గా ‘ఓ మై గాడ్ 2’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో అక్షయ్‌కుమార్, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలు పోషించగా.. యామీ న్యాయవాదిగా నటించింది.
హిమాచల్ ప్రదేశ్‌లో జన్మించిన ఈ భామ.. పంజాబ్ యూనివర్సిటీలో లా డిగ్రీలో చేరింది. కానీ, మోడలింగ్‌లో వరస అవకాశాలు రావడంతో చదువు ఆపేసింది.
మోడలింగ్ చేస్తూనే ‘ఉల్లాస ఉత్సాహ’ అనే కన్నడ సినిమాతో తెరంగేట్రం చేసిన యామీ గౌతమ్.. 2011లో ‘నువ్విలా’తో తెలుగు చిత్రపరిశ్రమలో అడుగుపెట్టింది.
తర్వాత ‘యుద్ధం’, ‘గౌరవం’, ‘హీరో’, ‘సనమ్ రే’, ‘కాబిల్’, ‘సర్కార్ 3’, ‘ద సర్జికల్ స్ట్రైక్’, ‘బట్టి గుల్ మీటర్ చాలు’, ‘దాస్వి’ తదితర తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, పంజాబీ చిత్రాలతో ఆకట్టుకుంది.
తెలుగులో నితిన్ సరసన ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’లో అలరించింది. తన నటనతో మెప్పించినా ఆ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.
ఆదిత్య ధార్ అనే దర్శకుడిని 2021లో వివాహం చేసుకుంది. ఇప్పుడు తనకి ఒక కుమారుడు కూడా ఉన్నాడు.
ఈ సుందరికి రాజ్మా, పిజ్జా అంటే చాలా ఇష్టమట. ఎప్పుడైనా ట్రిప్‌కి వెళ్లాలనిపిస్తే యామి లద్దాఖ్‌కే ప్లాన్ చేస్తుందట. అమీర్‌ఖాన్, షారుఖ్‌ఖాన్, హృతిక్ రోషన్‌లకి యామి వీరాభిమాని.
తనకి ఎప్పుడు సమయం దొరికినా ఇంటీరియర్ డిజైన్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తుంటుంది. అంతేకాదు పాటలు పాడడం, డ్యాన్స్ చేయడం, యోగా చేయడం అంటే ఈ భామకి బాగా ఇష్టమట.