‘బెదురులంక’లో.. నేహా
‘డీజే టిల్లు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నేహా శెట్టి.. ఇప్పుడు ‘బెదురులంక 2012’ తో తెరపై మరోసారి మెరవనుంది. ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది.
(photos:instagram/iamnehashetty)
కార్తికేయ, నేహాశెట్టి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. క్లాక్స్ దర్శకత్వం వహించారు. యుగాంతం నేపథ్యంలో ఈ కథ సాగనుంది.
ఈ చిత్రంలో నేహాశెట్టి పల్లెటూరి అమ్మాయి చిత్రగా అలరించనుంది. తన పాత్ర ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని చెప్తుందీ భామ.
చిత్ర పాత్రను చక్కగా పోషిస్తుందా లేదా.. అని డైరక్టర్ చాలా టెన్షన్ పడ్డారట. కానీ ఈ సినిమాలో నేహా తన రోల్ అద్భుతంగా పోషించిందని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రశంసల వర్షం కురిపించారు.
‘బెదురులంక..’ ట్రైలర్ చూసిన తర్వాత రామ్‌చరణ్ దీనిపై స్పందిస్తూ.. ఈ చిత్రం ట్రైలర్ నాకు బాగా నచ్చింది.. ఈ సినిమా చూసేందుకు నేను వెయిట్ చేస్తున్నానని అన్నారు.
‘డీజే టిల్లు’ తర్వాత ఈ భామకు బాగా గుర్తింపు వచ్చింది.. ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉంది.
‘బెదురులంక..’ తర్వాత సెప్టెంబరులో ‘రూల్స్ రంజన్’ విడుదల కానుంది. దీంట్లో కిరణ్ అబ్బవరం సరసన నటించింది.
This browser does not support the video element.
ఈ సినిమాలోని ‘సమ్మోహనుడా..’ పాట ఈ మధ్యే విడుదలై బాగా వైరలయ్యింది. ఈ పాటలో నేహా తన డ్యాన్స్‌తో బాగా ఆకట్టుకుంది.
ఇదిలా ఉండగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో వస్తోన్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ లో విశ్వక్‌సేన్ సరసన నేహా హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ సినిమాలో మొదటి పాట ‘సుట్టంలా సూసి పోకలా..’ తాజాగా విడుదలైంది. దీనికి స్టేజ్‌పై విశ్వక్‌సేన్, నేహా శెట్టి వేసిన డ్యాన్స్ వీడియో తెగ వైరలయ్యింది.