#eenadu

ఎంత డబ్బు సంపాదిస్తున్నాం అనే విషయం కంటే సంపాదించిన మొత్తాన్ని ఎలా క్రమ పద్ధతిలో ఖర్చు చేస్తున్నామనే విషయమే కీలకం. భవిష్యత్తు అవసరాలు, లక్ష్యాలను గుర్తుంచుకుంటూ పొదుపు మార్గంలో అడుగులు వేయాలనుకొనే వారికే ఈ రూల్స్‌..

పరిమితి దాటొద్దు..

క్రెడిట్‌ కార్డు పరిమితి ఎప్పుడూ 30% శాతానికి మించకుండా ఉండేలా చూసుకోండి. ఒక వేళ ఏదైనా అవసరంతో ఎక్కువగా వినియోగించినా నెల మధ్యలోనే ఆ మేరకు చెల్లించే ప్రయత్నం చేయండి.

మలివయసులో భారం కాకుండా..

ప్రస్తుతం వస్తున్న ఆదాయంలో కనీసం 70% మొత్తాన్ని పదవీ విరమణ తర్వాత వచ్చేలా ప్రణాళిక వేసుకుంటే మలివయసులో భారం కాదు. అంటే మీకు నెలకు రూ.లక్ష వస్తుందనుకుంటే రూ.70వేలు వచ్చేలా ప్లాన్‌ చేసుకోవాలి.

మదుపు ముఖ్యం

ఎన్ని ఖర్చులున్నా ప్రతి నెలా జీతంలో 10- 15% భవిష్యత్‌ అవసరాల కోసం మదుపు చేయాలి. అంటే నెల ఆదాయం రూ.80వేలు ఉంటే రూ.12వేలు పెట్టుబడికి మళ్లించాలన్నమాట.

72తో డబ్బు డబుల్‌

పెట్టుబడిపై అందిస్తున్న వడ్డీ శాతాన్ని 72తో భాగిస్తే వచ్చే సంఖ్యనే మీ డబ్బు ఎన్నేళ్లకు రెట్టింపవుతుందో చెప్పేస్తుంది. ఉదాహరణకు..6శాతం వడ్డీ అనుకుంటే.. 72/6 = 12.

ఇన్సూరెన్స్‌ రూల్‌

ఎంత మొత్తంలో బీమా తీసుకోవాలనే విషయం గురించి చాలా మంది మదన పడుతుంటారు. వ్యక్తి సంవత్సర ఆదాయానికి 20 రెట్ల మొత్తంలో జీవిత బీమా ఉండటం మంచిది.. అనేది ఆర్థిక నిపుణుల భావన.

సొంతిల్లా.. అద్దె ఇల్లా..?

కొనుగోలు చేయాలనుకుంటున్న ఇంటి ధర కంటే అద్దె ఇంట్లో ఏడాదికి చెల్లిస్తున్న మొత్తం 4శాతం మించితే ఇంటిని కొనుగోలు చేయొచ్చు.

10శాతం మించకుండా..

షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెడుతున్నా.. మీ మొత్తం పెట్టుబడిలో 10శాతానికి మించి ఎక్కువగా పెట్టొద్దు. అంటే మీ పెట్టుబడి రూ.10లక్షలు అనుకుంటే రూ.లక్షకు మించకుండా వీటిలో పెట్టుబడులు ఉండేలా చూసుకోవాలి.

ఆగండాగండి..

ఏదైనా వస్తువు కొనాలంటే వెంటనే కొనే పద్ధతిని మానేయాలి. కనీసం ఒక రోజు తర్వాతే ఆ వస్తువు నిజంగా అవసరమా? లేదా? అని నిర్ధరించుకోవాలి.

మార్కెట్లో మదుపు చేస్తున్నారా? ఇవి తెలుసా..

విజేతలు చెప్పిన సూత్రాలు మీకోసం..

ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ ఐపీఓ.. కీ పాయింట్స్‌

Eenadu.net Home