మూడేళ్ల తర్వాత ఐప్యాడ్‌ మినీ.. వివరాలివీ..!

 యాపిల్‌ సంస్థ కొత్త యాపిల్‌ ఐప్యాడ్‌ మినీని (2024) తీసుకొచ్చింది. భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా దీన్ని లాంచ్ చేసింది.

2021 తర్వాత మినీ లైనప్‌లో వచ్చిన ఏడో ప్యాడ్‌ ఇదీ. ఐఫోన్‌ 15ప్రోలో వాడిన ఏ17 ప్రో చిప్‌ను ఇందులో వాడారు.

ఐప్యాడ్‌ మినీ (2024) 128జీబీ స్టోరేజీ కలిగిన వైఫై వేరియంట్ ధరను ₹49,900గా యాపిల్‌ నిర్ణయించింది. సెల్యులర్‌ వేరియంట్‌ ₹64,900కి లభిస్తుంది.

256జీబీ వైఫై వేరియంట్ ₹59,900, సెల్యులర్ ₹74,900; 512జీబీ వైఫై వేరియంట్ ₹79,900, సెల్యులర్‌ వేరియంట్ ధర ₹94,900గా నిర్ణయించారు.

అక్టోబర్‌ 23 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. కంపెనీ వెబ్‌సైట్‌లో ప్రీ ఆర్డర్లు ప్రారంభయ్యాయి. బ్లూ, పర్పుల్‌, స్పేస్‌ గ్రే, స్టార్‌లైట్‌ రంగుల్లో లభ్యమవుతుంది.

ఐప్యాడ్‌ మినీ 8.3 అంగుళాల లిక్విడ్‌ రెటీనా డిస్‌ప్లే, 500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో వస్తోంది.

ఐప్యాడ్ ఓఎస్‌ 18తో ఇది పనిచేస్తుంది. రాబోయే కొన్ని నెలల్లో యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లు కూడా రానున్నాయి.

వెనుక వైపు 12 ఎంపీ కెమెరా ఉంది. 4కె వరకు వీడియోలను రికార్డు చేయొచ్చు. ముందు వైపు 12 ఎంపీ కెమెరా ఇచ్చారు.

వైఫై 6ఈ, బ్లూటూత్‌ 5.3, 5జీ, జీపీఎస్‌ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ ఉంది.

అలాంటి పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవు!

ఎయిర్‌టెల్‌ ఓటీటీ ప్లాన్లు ఇవే..

హ్యాకర్స్‌లో.. వైట్‌, బ్లాక్‌, గ్రే... తెలుసా?

Eenadu.net Home