ఐఫోన్‌ 16 సిరీస్‌ ఫోన్లు విశేషాలు..

ఐఫోన్ 16 సిరీస్‌ ఫోన్లను యాపిల్ విడుదల చేసింది. ‘ఇట్స్‌ గ్లో టైమ్‌’ పేరిట సెప్టెంబర్‌ 9న నిర్వహించిన ఈవెంట్‌లో నాలుగు మొబైల్స్‌ను లాంచ్‌ చేసింది.

యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ తీసుకొచ్చిన ఈ మొబైల్స్‌లో కెమెరా కోసం కొత్తగా యాక్షన్‌ బటన్‌ను జోడించారు. ఏ18 చిప్‌తో వస్తున్న ఈ ఫోన్లు ఐఓఎస్‌18తో పనిచేస్తాయి.

ఐఫోన్‌ 16

6.1 అంగుళాల డిస్‌ప్లేతో వస్తున్న ఈ ఫోన్‌లో 48 ఎంపీ ప్రధాన కెమెరా, 12 ఎంపీ సెన్సర్‌, డాల్బీ విజన్‌, 4K వీడియోలు తీసుకోవచ్చు.

128జీబీ వేరియంట్‌ ధర రూ.79,900. ఈ ఫోన్‌ 256 జీబీ, 512 జీబీ స్టోరేజీ వేరియంట్‌లోనూ లభిస్తుంది.

ఐఫోన్‌ 16 ప్లస్‌ 

6.7 అంగుళాల డిస్‌ప్లే కలిగిన ఈ ఫోన్‌ 128జీబీ వేరియంట్‌ ధర రూ.89,900. 256జీబీ, 512 జీబీ వేరియంట్లూ ఉన్నాయి. 48 ఎంపీ ప్రధాన కెమెరా, 12 ఎంపీ సెన్సర్‌ ఉంది. ఐదు రంగుల్లో లభిస్తుంది.

ఐఫోన్‌ 16 ప్రో

6.3 అంగుళాల ఎక్స్‌డీఆర్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. 48ఎంపీ వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 48 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 12 ఎంపీ టెలిఫొటో కెమెరా ఉంది.

120Hz రిఫ్రెష్‌ రేటు, 2,000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, IP68 రేటింగ్‌ కలిగి ఉంటుంది. 128జీబీ వేరియంట్‌ ధర రూ.1,19,900. ఇందులో 512 జీబీ, 1టీబీ వేరియంట్లు ఉన్నాయి.

ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌

6.9 అంగుళాల ఎక్స్‌డీఆర్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్‌ రేటు, 2,000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, IP68 రేటింగ్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. 256జీబీ వేరియంట్‌ ధర రూ.1,44,900. 512 జీబీ, 1టీబీ వేరియంట్లలో లభిస్తుంది. 

ఈ నాలుగు మొబైల్స్‌ ప్రీ ఆర్డర్స్‌ సెప్టెంబర్‌ 13 నుంచి ప్రారంభమవుతాయి. సెప్టెంబర్‌ 20 నుంచి విక్రయాలు మొదలవుతాయి.

IRCTCలో ఈ విషయాలు తెలుసా?

చాట్‌బాట్స్‌తో ఇవి పంచుకోవద్దు!

జాగ్రత్తలే.. ఆపద నుంచి రక్షిస్తాయి..

Eenadu.net Home