ఐపీఎల్‌ 2023: ఈ సీజన్‌ శతక వీరులు!

(మే 21)

హ్యారీ బ్రూక్‌ SRH

Image: Twitter

ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ శతకం సాధించాడు. 55 బంతుల్లోనే వంద పరుగులు తీసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతాపై హైదరాబాద్‌ విజయం సాధించింది. 

Image: Twitter

యశస్వి జైస్వాల్‌ RR

Image: Twitter

రాజస్థాన్‌ రాయల్స్‌ యువ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌.. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ(53 బంతుల్లో) కొట్టాడు. మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి.. 62 బంతుల్లో 124 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ ఓడిపోవడంతో యశస్వీ సెంచరీ వృథా అయింది.

Image: Twitter

సూర్యకుమార్‌ యాదవ్‌ MI

Image: Twitter

ముంబయి బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఐపీఎల్‌లో తొలి సెంచరీ సాధించాడు. గుజరాత్‌ టైటన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 బంతుల్లోనే వంద పరుగులు రాబట్టాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌పై ముంబయి ఘన విజయం అందుకుంది. 

Image: Twitter

వెంకటేశ్‌ అయ్యర్‌ KKR

Image: Twitter

ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాడు వెంకటేశ్‌ అయ్యర్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. 51 బంతుల్లో శతకం(104) సాధించాడు. అయితే, ముంబయి కూడా దీటుగా ఆడటంతో కేకేఆర్‌ ఓడిపోయింది. 

Image: Twitter

ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ PBKS

Image: Twitter

దిల్లీ క్యాపిటల్స్‌తో పంజాబ్‌ కింగ్స్‌ తలపడిన మ్యాచ్‌లో ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ శతకం బాదేశాడు. 65 బంతుల్లో 103 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో దిల్లీపై పంజాబ్‌ గెలిచింది.

Image: Twitter

శుభ్‌మన్‌ గిల్‌ GT 

Image: Twitter

గుజరాత్‌ టైటన్స్‌ స్టార్‌ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ (58 బంతుల్లో 101 పరుగులు) కొట్టాడు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై గుజరాత్‌ 34 పరుగుల తేడాతో గెలిచింది. 

Image: Twitter

హెన్రిచ్‌ క్లాసెన్‌ SRH

Image: Twitter

బెంగళూరు జట్టుతో ఉప్పల్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో హెన్రిచ్‌ క్లాసెన్‌.. క్లాసిక్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 51 బంతుల్లో 104 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. కానీ, హైదరాబాద్‌ జట్టు ఓడిపోయింది.

Image: Twitter

విరాట్‌ కోహ్లీ RCB

Image: Twitter

హైదరాబాద్‌లో ఆతిథ్య జట్టుపై విజయం సాధించింది.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన విరాట్‌.. 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో సెంచరీ చేశాడు. 63 బంతుల్లో శతకం సాధించి జట్టును గెలిపించాడు.

Image: Twitter

కామెరూన్‌ గ్రీన్‌ MI

Image: Twitter

ఐపీఎల్‌ లీగ్‌లో హైదరాబాద్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో ముంబయి గెలుపొందింది. ముంబయి బ్యాటర్‌ కామెరూన్‌ గ్రీన్‌ చెలరేగి ఆడి సెంచరీ చేశాడు. 47 బంతుల్లో 100 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

Image: Twitter

IPL: ఈసారి వీళ్లే టాక్‌ ఆఫ్‌ ది ఆక్షన్‌

IPL వేలం: 2022లో ₹ 551.7 కోట్లు... మరిప్పుడు ఎంత?

IPL వేలం: గతేడాది స్టార్క్‌.. అంతకుముందు ఎవరంటే?

Eenadu.net Home