ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఫోన్‌.. ఐకూ 11

ఐకూ తాజాగా ప్రపంచంలోనే అత్యంత వేగవవంతమైన మొబైల్‌ను తీసుకొచ్చింది. గత డిసెంబర్‌లో ఈ ఫోన్‌ను చైనాలో ఆవిష్కరించగా.. తాజాగా భారత్‌లో విడుదల చేసింది.

Image: Iqoo

ఐకూ 11 పేరుతో తీసుకొచ్చిన ఈ 5జీ మొబైల్‌లో 144 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.78 అంగుళాల 2కే ఈ6 అమోలెడ్‌ డిస్‌ప్లే ఇచ్చారు. భారత్‌లో ఇలాంటి డిస్‌ప్లే ఇవ్వడం ఇదే తొలిసారి. 

Image: Iqoo

భారత్‌లో మొదటిసారి ఈ మొబైల్‌లోనే క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 ప్రాసెసర్‌ను వినియోగించారు. దీంతోపాటు వీ2 గ్రాఫిక్‌ చిప్‌ను అమర్చారు. 

Image: Iqoo

వెనకవైపు 50 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 8 ఎంపీ వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 13 ఎంపీ టెలిఫొటో కెమెరా.. ముందుభాగంలో 16 ఎంపీ కెమెరా ఇచ్చారు. 

Image: Iqoo

దీంట్లో 120 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేసే 5,000ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 8 నిమిషాల్లోనే 50శాతం ఛార్జ్‌ అవుతుందని ఐకూ చెబుతోంది. 

Image: Iqoo

ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత ఫన్‌టచ్‌ 13 ఓఎస్‌తో పనిచేసే ఈ మొబైల్‌లో ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ రీడర్‌ ఉంది. ఈ మొబైల్‌ ఆల్ఫా బ్లాక్‌, లెజెండ్‌ వైట్‌ రంగుల్లో లభించనుంది.

Image: Iqoo

8 జీబీ / 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 59,999 కాగా.. 16 జీబీ / 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 64,999గా ఉంది. ర్యామ్‌ను వర్చువల్‌గా మరో 8జీబీ వరకు పెంచుకోవచ్చు.

Image: Iqoo

జనవరి 13 నుంచి అమెజాన్‌లో విక్రయాలు ప్రారంభమవుతాయి. ప్రైమ్‌ సభ్యులకు జనవరి 12 నుంచే మొబైల్‌ అందుబాటులో ఉండనుంది. వివిధ బ్యాంకు కార్డుల ద్వారా రూ.5వేల వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. మొబైల్‌ ఎక్స్ఛేంచ్‌ కింద మరో రూ. 3వేలు ఆదా చేసుకోవచ్చు. 

Image: Iqoo

పిల్లలు విసిగిస్తున్నారని ఫోన్ ఇస్తున్నారా..?

అలాంటి పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవు!

ఎయిర్‌టెల్‌ ఓటీటీ ప్లాన్లు ఇవే..

Eenadu.net Home