టాలీవుడ్‌ ‘డెవిల్‌’తో ఇరానీ భామ డ్యాన్స్‌!

‘సాక్రెడ్‌ గేమ్స్‌’, ‘అభయ్‌’ వెబ్‌సిరీస్‌లతో బాలీవుడ్‌ భామ అనిపించుకుంది ఇరాన్‌కు చెందిన నటి ఎల్నాజ్‌ నొరౌజీ.

Image: Instagram/Elnaaz Norouzi

తాజాగా ఈ ఇరానీ భామ.. టాలీవుడ్‌లోనూ కనిపించబోతోంది. నందమూరి కల్యాణ్‌రామ్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘డెవిల్‌: ది సీక్రెట్‌ ఏజెంట్‌’లోని ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడనుంది.

Image: Instagram/Elnaaz Norouzi

ఇరాన్‌లోని టెహ్రాన్‌లో జన్మించిన ఎల్నాజ్‌.. జర్మనీలో పెరిగింది. టీనేజ్‌లోనే మోడలింగ్‌లో అడుగుపెట్టింది. అంతర్జాతీయ బ్రాండ్స్‌ ప్రచార చిత్రాల్లో నటించింది. 

Image: Instagram/Elnaaz Norouzi

పదేళ్లపాటు మోడలింగ్‌ చేసిన ఎల్నాజ్‌.. ఈ క్రమంలో బాలీవుడ్‌ హీరోలు సల్మాన్‌ ఖాన్‌, షారుక్‌ఖాన్‌తోనూ పలు ప్రచార చిత్రాల్లో మెరిసింది. 

Image: Instagram/Elnaaz Norouzi

ఆ తర్వాత ‘సాక్రెడ్‌ గేమ్స్‌’తో బాలీవుడ్‌కి పరిచయమైంది. ‘ఖిడో ఖుండి’ అనే పంజాబీ సినిమాతోపాటు పలు వెబ్‌సిరీస్‌లు, సినిమాల్లో నటించింది. మ్యూజిక్‌ ఆల్బమ్స్‌లో తన మ్యాజిక్‌ చూపించింది. 

Image: Instagram/Elnaaz Norouzi

సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టే ముందే ఎల్నాజ్‌.. జర్మనీలోనే నటనలో శిక్షణ తీసుకుంది. నాటకాల్లోనూ పాల్గొంది. 

Image: Instagram/Elnaaz Norouzi

ఎల్నాజ్‌.. మంచి డ్యాన్సర్‌. చిన్నప్పుడే పర్షియన్‌ సంప్రదాయ నృత్యంతోపాటు, హిప్‌హాప్‌ నేర్చుకుంది. ప్రస్తుతం కథక్‌ డ్యాన్స్‌ నేర్చుకుంటోంది.

Image: Instagram/Elnaaz Norouzi

శరీరం ఫిట్‌గా ఉండటానికి క్రమం తప్పకుండా జిమ్‌, యోగా, డ్యాన్స్‌ చేస్తుందట. ఎం.ఎం.ఏ(మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌) కూడా ప్రాక్టీస్‌ చేస్తోంది.

Image: Instagram/Elnaaz Norouzi

ఎల్నాజ్‌.. బహుభాషాకోవిదురాలు. జర్మన్‌, ఇంగ్లీష్‌, ఫ్రెంచ్‌, హిందీ, ఉర్దూ, పంజాబీ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు.

Image: Instagram/Elnaaz Norouzi

మాస్టర్‌ డిగ్రీ చేసిన ఈ భామ.. ఫిలాసఫర్‌ కూడా. తన ఇన్‌స్టాలో వ్యక్తిగత అప్‌డేట్స్‌తోపాటు స్ఫూర్తినిచ్చే వాక్యాలు రాస్తుంటుంది.

Image: Instagram/Elnaaz Norouzi

జర్మనీలో ప్రచురితమయ్యే ఫోకస్‌ మ్యాగజీన్‌ రూపొందించిన ‘100 విమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2022’ జాబితాలో ఎల్నాజ్‌ చోటు దక్కించుకుంది. 

Image: Instagram/Elnaaz Norouzi

తన మాతృభూమి ఇరాన్‌లో జరుగుతున్న దురాగతాలపై ఎల్నాజ్‌ ఎప్పటికప్పుడు స్పందిస్తుంటుంది. అనేక సంఘటనలకు వ్యతిరేకంగా సోషల్‌మీడియా వేదికగా నిరసన వ్యక్తం చేస్తోంది. 

Image: Instagram/Elnaaz Norouzi

ఈ గ్లామరస్‌ బ్యూటీకి ఇన్‌స్టాలో 2.3 మిలియన్‌ ఫాలోవర్స్‌ ఉన్నారు. 

Image: Instagram/Elnaaz Norouzi

ఈ వారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు

ఈ హీరోయిన్ల ‘టాటూ’ అర్థం తెలుసా?

స్ట్రాప్‌లెస్‌ ట్రెండ్‌ గురించి విన్నారా!

Eenadu.net Home