కలవరమాయె మదిలో..!

ఇటీవలి కాలంలో సెలబ్రిటీలు, యువకుల గుండెపోటు మరణాల వార్తలు ఎక్కువగా వింటున్నాం.

source : pixabay

అప్పుడప్పుడూ కాస్త ఛాతీలో నొప్పి కలుగగానే మనకూ అలాంటి ముప్పు ఏదైనా ఉందా అనే సందేహం కలుగుతూ ఉంటుంది.

source : pixabay

కానీ.. ఛాతీ నొప్పి, గుండె నొప్పికి స్వల్ప వ్యత్యాసం ఉంటుంది. చిన్న చిన్న తేడాలతో దాన్ని మనం గుర్తించొచ్చు.

source : pixabay

మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారికి గుండె పోటు వచ్చే ఆస్కారం ఉంది. పొగ, మద్యం తాగే అలవాట్లు కూడా హృదయానికి చేటు చేస్తాయి.

source : pixabay

కుటుంబంలోని పెద్దలు, పూర్వీకుల్లో ఎవరికైనా గుండె సమస్యలు ఉన్నట్లయితే అవి జన్యుపరంగా సక్రమించే అవకాశం ఉంటుంది. 

source : pixabay

ఛాతీలో నొప్పి మొదలైన వెంటనే ముందు కంగారు పడొద్దు. ఆ నొప్పి ఏ స్థాయిలో మిమ్మల్ని బాధ పెడుతోందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.

source : pixabay

నొప్పి మాత్రమే కాకుండా శ్వాస తీసుకోవడంలో తేడా.. చేయి, భుజం, కడుపునొప్పి, దవడ అదరడం, అలసట తదితర లక్షణాలున్నాయా అనేది గమనించండి.

source : pixabay

గుండెలో సమస్య ఉంటే నొప్పి బొడ్డు నుంచి భుజం వరకు ఎక్కడైనా రావొచ్చు. నడిచినా, పని చేసినా నొప్పి తీవ్రత ఎక్కువ అవుతుంటే గుండెపోటుగా అనుమానించి వెంటనే వైద్యులను సంప్రదించాలి.

source : pixabay

కండరాలు పట్టేయడం, ఎముకల బలహీనత, జీర్ణాశయ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యతోనూ ఛాతీలో నొప్పి రావొచ్చు. ఊపిరితిత్తుల్లో సమస్య ఉన్నప్పుడు దగ్గు, జ్వరం, కఫం పడటం వంటి లక్షణాలు ఉంటాయి. 

source : pixabay

ఇక తరచూ ఛాతీనొప్పి ఇబ్బంది పెడుతుంటే మాత్రం గుండె వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం. వారు ప్రాథమిక స్థాయిలో ఈసీజీ పరీక్ష చేస్తారు. సమస్య ఉన్నట్లయితే 2డి ఎకో, ట్రెడ్‌మిల్‌ టెస్టులు చేసి గుండెలో సమస్య ఎక్కడుందో నిర్ధారిస్తారు.

SOURCE : EENADU

రక్తహీనతకు అనేక కారణాలు అంటున్నారు వైద్యులు..

ఆరోగ్యాన్ని, ఆయుష్షును అందించే ఆహారం!

లివర్‌ కొవ్వుకి ఈ ఆహరపదార్థాలే కారణం!

Eenadu.net Home