సిరాజ్‌ ‘లైక్డ్‌’ గర్ల్‌ఫ్రెండ్‌!

స్టార్‌ క్రికెటర్‌ మహ్మద్‌ సిరాజ్‌, బాలీవుడ్‌ నటి మహిరా శర్మ రిలేషన్‌లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఇటీవల మహిరా పోస్టు చేసిన బ్యాక్‌లెస్‌ డ్రెస్‌ ఫొటోకి సిరాజ్‌ లైక్‌ కొట్టడంతో ఈ వదంతులకి మరింత బలం చేకూరింది. అయితే, కాసేపటికే లైక్ తీసేశాడు.

వీరిద్దరూ డేట్‌కి వెళ్లినట్టు, ఒకే లొకేషన్‌లో కనిపించినట్లు అభిమానులు సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. 

మహిరా విషయానికొస్తే... 1997లో జమ్ములో పుట్టింది. పాఠశాల విద్య అనంతరం కుటుంబం ముంబయికి షిఫ్ట్‌ అయ్యింది.

ముంబయి యూనివర్శిటీలో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. మోడల్‌గా కెరీర్‌ను మొదలుపెట్టింది.

‘తారక్‌ మెహతా రివర్స్‌ గ్లాసెస్‌’తో 2015లో బుల్లితెరపై అడుగుపెట్టింది. అప్పటి నుంచి వరుస సీరియళ్లు, టీవీ షోలతో అలరిస్తోంది. 

పంజాబీలో ‘లంబోర్గినీ’, ‘రరాద్వా రిటర్న్స్‌’, బాలీవుడ్‌లో ‘రాన్సమ్‌వేర్‌’లో నటించింది. 

2019 నుంచి 2022 వరకూ దాదాపు 25కు పైగా మ్యూజిక్‌ ఆల్బమ్స్‌లో ఆడి పాడింది. ఇవే ఆమెకు గుర్తింపు తెచ్చి పెట్టాయి.

హిందీ బిగ్‌బాస్‌ 13లో పార్టిసిపేట్‌ చేసి పాపులర్‌ అయ్యింది. ఇప్పటికీ బిగ్‌బాస్‌ మహిరా అంటేనే గుర్తుపట్టేంతలా..!

ఇన్‌స్టాలో 87లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. 

మహిరాకి పారిస్‌ అంటే ఇష్టం. అక్కడికి వెళ్లినప్పుడల్లా పెర్‌ఫ్యూమ్‌ కొనుగోలు చేయకుండా రానంటోంది.

షారుఖ్‌, రణ్‌వీర్‌సింగ్‌కు వీరాభిమాని. స్ట్రీట్‌ ఫుడ్‌లో వడాపావ్‌ అంటే ఇష్టం.

నలుపు.. అందాల మెరుపులు

ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. టాప్‌-10 చిత్రాలివే!

2024 మోస్ట్‌ పాపులర్‌ స్టార్స్‌

Eenadu.net Home